Prabhas : ప్ర‌భాస్ జాత‌కం ఎలా ఉందో తెలుసా ? మ‌హ‌ర్జాత‌కుడు అవుతాడ‌ట‌..!

Prabhas : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే సినీ ఇండస్ట్రీతోపాటు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం. కనుక ప్రభాస్ కు సంబంధించిన ఎలాంటి విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన యాక్టింగ్, స్టైలిష్ లుక్స్, ఫైట్స్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఓ రేంజ్ తో ముందుకు దూసుకుపోతున్నారు.

సీనియర్ రెబల్ స్టార్ పేరును ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాడు. అంతటి ఘనత సాధించిన ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ సినిమాల నుండి వచ్చే అప్డేట్స్ కోసం ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జాతకం ఎలా ఉందో తెలియజేసే వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది.

1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించిన నక్షత్రం, రాశి ప్రకారం చూస్తే ప్రభాస్ మహర్జాతకుడు అని అంటున్నారు జ్యోతిష్యులు. రెబల్ అనే సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన కృష్టంరాజు ప్రభాస్ పుట్టిన రోజున జాతకం చూసేందుకు ఎంతోమంది జ్యోతిష్యులను పిలిపించి జాతకం చూపిస్తారు. అలాగే రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ పుట్టినరోజున ఆయన జాతకం గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు. అయితే ప్రభాస్ జాతకం అత్యద్భుతంగా ఉందని, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన ఎం.జి. రామచంద్రన్ జాతకంలా ప్రభాస్‌ జాతకం ఉందని చెప్పారు.

అంతేకాకుండా ప్రభాస్ దేశం గర్వపడేలా ఎదుగుతారని అన్నారు. సినీ చరిత్రలో ఎమ్జీఆర్, ఎన్టీఆర్, రజనీకాంత్ లు ఎంత గొప్ప గుర్తింపును పొందారో.. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అంతే గుర్తింపు సంపాదించుకుంటారని జ్యోతిష్యులు తెలిపారు. అలాగే ఆయన పెళ్ళి గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ కు 2023 లో పెళ్ళి జరుగుతుందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM