Rishab Shetty : కాంతారా మూవీ న‌చ్చిందా.. అయితే రిష‌బ్ శెట్టి న‌టించిన ఈ 5 మూవీల‌ను కూడా ఒక‌సారి చూడండి.. ఓటీటీల్లో ఉన్నాయి..

December 1, 2022 4:57 PM

Rishab Shetty : క‌న్న‌డ న‌టుడు రిష‌బ్ శెట్టి న‌టించిన కాంతారా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ మొద‌ట క‌న్న‌డ‌లో రిలీజ్ కాగా అక్క‌డ ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో ఈ సినిమాను ప‌లు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లోకి సైతం అనువదించారు. ఈ క్ర‌మంలోనే కాంతారా తెలుగులోనూ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ దేశ‌వ్యాప్తంగా రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోఈ మూవీని వీక్షించ‌వ‌చ్చు. అయితే కాంతారా హిట్ కావ‌డంతో ప్రేక్ష‌కులు అంద‌రూ రిష‌బ్ శెట్టి న‌టించిన ఇత‌ర క‌న్న‌డ సినిమాలు ఏంటి.. అని వెద‌క‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన ప‌లు క‌న్న‌డ హిట్ సినిమాలు ఏమిటో.. అవి ఏయే ఓటీటీ యాప్‌ల‌లో అందుబాటులో ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

రిష‌బ్ శెట్టి న‌టించిన బెల్ బాట‌మ్ మూవీ 2019లో రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ల‌లో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో హ‌రిప్రియ‌, అచ్యుత్ కుమార్‌, యోగ‌రాజ్ భ‌ట్‌, ప్ర‌మోద్ శెట్టి త‌దిత‌రులు న‌టించారు. ఈ మూవీని ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఎంఎక్స్ ప్లేయ‌ర్ యాప్‌లో అందుబాటులో ఉంది. అలాగే రిష‌బ్ శెట్టి న‌టించిన మ‌రో మూవీ స‌ర్కారీ హిరియ ప్రాథ‌మిక శాలె, కాస‌ర‌గొడు, కొడుగె కూడా హిట్ అయింది. ఈ మూవీని 2018లో రిలీజ్ చేశారు. 2019లో జాతీయ ఉత్త‌మ చిన్నారుల సినిమాగా ఈ మూవీకి అవార్డు సైతం ల‌భించింది. ఈ మూవీని జియో సినిమా యాప్‌లో వీక్షించ‌వ‌చ్చు.

Rishab Shetty super hit movies other than kantara
Rishab Shetty

ఇక రిష‌బ్ శెట్టి న‌టించిన మ‌రో క‌న్న‌డ మూవీ.. గ‌రుడ గ‌మ‌న రిష‌బ వాహ‌న జీ5 యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ కూడా చూడ‌ద‌గిన‌దే. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కించారు. హ‌రిక‌థె అల్లా గిరిక‌థె పేరిట వ‌చ్చిన మ‌రో రిష‌బ్ శెట్టి మూవీ కూడా హిట్ మూవీనే. దీన్ని వూట్ యాప్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే క‌థా సంగ‌మ అనే ఇంకో మూవీ కూడా రిష‌బ్ శెట్టి హిట్ చిత్రాల జాబితాలో ఉంది. దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment