RGV : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అంతటా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొన్నటి వరకు పవన్-వైసీపీ మధ్య భీకర యుద్ధం జరగగా, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న చందాన మారింది. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు నిరసన చేపట్టారు.
తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీడీపీ నేతలు దూషించారంటూ వైసీపీ శ్రేణులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణులు తమ వర్షెన్ తాము చెబుతున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ తనదైన స్టైల్‌లో స్పందించే వర్మ ఏపీ రాజకీయాలపై కూడా ట్వీట్ చేశారు.
‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. బాక్సింగ్ నేర్చుకుంటే ఒకరికొకరు మంచిగా ఫైట్ చేసుకోవచ్చనే అభిప్రాయంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై కూడా వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమావాళ్లను సర్కస్ అంటూ చెప్పుకొచ్చాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…