RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంటారు. ఆయన చేసే సంచలన ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అలాగే లోకల్ నుండి ఇంటర్నేషనల్ పొలిటిషియన్స్ వరకు వర్మ ట్వీట్స్ రచ్చ సాగుతూనే ఉంటుంది. ఇటీవల బాలీవుడ్ కు మండిపోయే ప్రశ్నను వర్మ సంధించారు. దక్షిణాది సినిమాలు హిందీలో సైతం విడుదలవుతూ భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన సినిమాలను ప్రశంసిస్తూ.. హిందీ సినిమాలను తక్కువ చేసేలా వర్మ ట్వీట్ చేశారు.
ఇక తాజాగా ఆచార్య సినిమా స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై తనదైన శైలిలో అస్త్రాలు సంధించారు. ఆచార్య ప్రమోషన్ వీడియోను వాడేస్తూ తండ్రీ కొడుకుల గాలి తుస్సుమనిపించారు. ఆచార్య నుంచి విడుదల చేసిన ఆ వీడియోలో.. నువ్వు నన్ను డామినేట్ చేస్తావా.. అంటూ చిరంజీవి- రామ్ చరణ్ మధ్య నడిచిన సంభాషణ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోని షేర్ చేసిన వర్మ.. తండ్రి, కొడకులపై సెటైర్స్ వేశారు. తగ్గను.. తగ్గను.. అంటూ అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్స్‌తో మెగా ఫాదర్, మెగా సన్ అనుకుంటూ ఉండటం చూసి నేను మెగా హర్ట్ అయ్యాను. ఇక్కడ బన్నీ డైలాగులు వాడటం చూస్తుంటే న్యూ మెగా హీరో అల్లు అర్జునే అని రామ్ చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది.. అని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా విజయవాడలో ఒక ప్రముఖ కళాశాలలో జరుగుతుంది.. అంటూ ప్రచారం మొదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, పూజ హెగ్డె హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోనా సహా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…