RGV : అల్లు అర్జున్‌ని పొగుడుతూ.. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను విమ‌ర్శించిన వ‌ర్మ‌..!

April 17, 2022 6:12 PM

RGV : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ వార్త‌ల‌లో నిలుస్తుంటారు. ఆయ‌న చేసే సంచ‌ల‌న ట్వీట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వ‌ర‌కు అలాగే లోక‌ల్ నుండి ఇంట‌ర్నేష‌న‌ల్ పొలిటిషియ‌న్స్ వ‌ర‌కు వ‌ర్మ ట్వీట్స్ ర‌చ్చ సాగుతూనే ఉంటుంది. ఇటీవ‌ల బాలీవుడ్ కు మండిపోయే ప్రశ్నను వర్మ సంధించారు. దక్షిణాది సినిమాలు హిందీలో సైతం విడుదలవుతూ భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన సినిమాలను ప్రశంసిస్తూ.. హిందీ సినిమాలను తక్కువ చేసేలా వర్మ ట్వీట్ చేశారు.

RGV satires on Chiranjeevi and Ram Charan but praised Allu Arjun
RGV

ఇక తాజాగా ఆచార్య సినిమా స్టార్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌పై త‌న‌దైన శైలిలో అస్త్రాలు సంధించారు. ఆచార్య ప్రమోషన్ వీడియోను వాడేస్తూ తండ్రీ కొడుకుల గాలి తుస్సుమ‌నిపించారు. ఆచార్య నుంచి విడుదల చేసిన ఆ వీడియోలో.. నువ్వు నన్ను డామినేట్ చేస్తావా.. అంటూ చిరంజీవి- రామ్ చరణ్ మధ్య నడిచిన సంభాషణ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోని షేర్ చేసిన వర్మ.. తండ్రి, కొడ‌కుల‌పై సెటైర్స్ వేశారు. తగ్గను.. తగ్గను.. అంటూ అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్స్‌తో మెగా ఫాదర్, మెగా సన్ అనుకుంటూ ఉండటం చూసి నేను మెగా హర్ట్ అయ్యాను. ఇక్కడ బన్నీ డైలాగులు వాడటం చూస్తుంటే న్యూ మెగా హీరో అల్లు అర్జునే అని రామ్ చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది.. అని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా విజయవాడలో ఒక ప్రముఖ కళాశాలలో జరుగుతుంది.. అంటూ ప్రచారం మొదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, పూజ హెగ్డె హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోనా సహా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment