RGV : అమ్మాయిలు ఆ విష‌యం అడిగితే.. కాద‌న‌లేక‌పోతున్నా.. అంటున్న వ‌ర్మ‌..!

May 5, 2022 3:34 PM

RGV : డేరింగ్ అండ్ డాషింగ్ ప‌ర్స‌న్ రామ్ గోపాల్ వ‌ర్మ చేసే కామెంట్స్ ఎవ‌రికీ ఓ ప‌ట్టాన అర్ధం కావు. చేసే పోస్ట్‌లు, తీసే సినిమాలు మెంట‌లెక్కిస్తుంటాయి. రీసెంట్‌గా ఆయ‌న మా ఇష్టం అనే సినిమా చేశారు. దేశంలోనే తొలిసారి మా ఇష్టం సినిమా రూపంలో ఇద్ద‌ర‌మ్మాయిల ప్రేమ‌ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన‌ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాల‌ను పెంచేశాయి. లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి ఇందులో రెచ్చిపోయి న‌టించిన‌ట్టు తెలుస్తోంది.

RGV or Ram Gopal Varma interesting comments on his life
RGV

చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి వెళ్లారు. అక్క‌డ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఆలీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన రీతిలో బ‌దులిచ్చారు. త‌న‌లా బ‌తకాలి అనుకుంటే దైవం, స‌మాజం, కుటుంబాన్ని వ‌దిలేయాలంటున్నాడు వ‌ర్మ‌. గత 20 సంవత్సరాలుగా తనకి ఇష్టం వచ్చినట్లుగా బతుకున్నానని తెలిపాడు. ఇక రాజకీయాల్లోకి వస్తే ఒక్కరు కూడా తనకి ఓటు వెయ్యరని ఎందుకంటే తాను ముఖ్యమంత్రి అయితే డబ్బంతా తీసుకుని విదేశాలకు వెళ్లిపోతానని చెప్పాడు.

బ‌ర్త్ డే పార్టీలు చేసుకోవ‌డం అస్స‌లు మీకు ఇష్టం ఉండ‌దు క‌దా, ఇటీవ‌ల బాగా చేసుకుంటున్నార‌ని అడ‌గ‌గా, దానికి స్పందించిన వ‌ర్మ‌.. కొందరు అమ్మాయిలు తనకు బర్త్‌డే పార్టీలు ఇస్తుంటే కాదనలేకపోతున్నానని తెలిపాడు. అటు గతంలో తన దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమా ఆడియో వేడుకలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి వివరించారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ‌ర్మ సినిమా మే 6న విడుద‌ల కానుండ‌గా.. ఇది ఎంత సెన్సేష‌న్ సృష్టిస్తుందా.. అని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now