Anushka : వేదం సినిమా క‌ర్పూరం పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవ‌రో తెలుసా…! అనుష్క‌కు ఏమ‌వుతుందంటే..!

October 13, 2022 3:21 PM

Anushka : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించి క‌లెక్ష‌న్స్  రాబ‌డితే.. మ‌రికొన్ని సినిమాలు ఇటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చి వారి హృద‌యాల‌లో మర్చిపోలేని స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలా ప్రేక్షకుల మ‌దిలో స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం మూవీ కూడా ఒక‌టి. ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా అల్లు అర్జున్, మంచు మ‌నోజ్ లు హీరోలుగా న‌టించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.

ఇక ఈ సినిమాలో అనుష్క శెట్టి, దీక్షాసేత్, అతిథి గౌతమ్ హీరోయిన్స్ గా నటించారు . అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా క‌మ‌ర్షియల్ సినిమాల కాకుండా డిఫ‌రెంట్ గా కొంద‌రి జీవితాల‌లో జ‌రిగే యదార్థగాథలకు అనుగుణంగా పాత్రలను చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో అనుష్క వేశ్య పాత్ర‌లో నటించ‌డం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఈ సినిమాలో అనుష్క న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

anushka
anushka

ఇక ఈ సినిమాలో అనుష్క పాత్రతో పాటు అనుష్కని అంటిపెట్టుకునే తిరిగే మరో క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టరే అనుష్క స్నేహితురాలు క‌ర్పూరం. ఎప్పుడూ అనుష్క ప‌క్క‌నే ఉండే హిజ్రా క‌ర్పూరం పాత్ర ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకుంది. సినిమాలో బ్ర‌హ్మానందంతో క‌ర్పూరం చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను పొట్టచెక్కలయ్యేలా న‌వ్వించింది. అంతే కాకుండా క‌ర్పూరం కాల్పుల్లో గాయ‌ప‌డినప్పుడు ఉండే ఎమోష‌నల్ సన్నివేశం ప్రేక్ష‌కులను కంటతడి పెట్టించింది. ఈ కర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రు అన్న సంగ‌తి మాత్రం చాలా మందికి తెలియదు.

మొదటిగా క‌ర్పూరం పాత్ర‌ను ద‌ర్శ‌కుడు క్రిష్ చేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ క్రిష్ త‌ల్లి ఆ పాత్రలో నటించవద్దని హెచ్చ‌రించడం జరిగిందట. అయితే అదే స‌మ‌యంలో అనుష్క త‌న మేకప్ ఆర్టిస్ట్ నిక్కి ఫోటోల‌ను క్రిష్ కు చూపించటం జరిగిందట. ఫొటోస్ తోపాటు క‌జ్ రారే పాట‌కు నిక్కి చేసిన డ్యాన్స్ వీడియోను కూడా క్రిష్ కు చూపించార‌ట‌ అనుష్క.  ఆ వీడియో చూసి క‌ర్పూరం పాత్ర‌కు నిక్కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని క్రిష్ వెంటనే ఓకే చేయడం జరిగిందట. ఆ విధంగా నిక్కి వేదం చిత్రంలో కర్పూరం పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now