Redmi K50i : భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే తో వ‌చ్చిన.. రెడ్‌మీ కె50ఐ స్మార్ట్ ఫోన్‌..!

July 20, 2022 5:06 PM

Redmi K50i : మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో మిడ్‌రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. రెడ్‌మీ కె50ఐ పేరిట విడుదలైన ఈ ఫోన్‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీంట్లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తోంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప‌వ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల ఫోన్ చాలా వేగంగా ప‌నిచేస్తుంది. అలాగే ఫోన్ కూల్‌గా ఉండ‌డం కోసం లిక్విడ్ కూల్ 2.0 టెక్నాల‌జీని ఇందులో అందిస్తున్నారు.

ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్లు ల‌భిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇందులో ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

Redmi K50i smart phone launched in India
Redmi K50i

ఈ ఫోన్‌లో డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల సౌండ్ చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే 5జి, వైఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఇందులో ల‌భిస్తున్నాయి. ఈ ఫోన్‌లో 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను, 5080 ఎంఏహెచ్ బ్యాట‌రీతో అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్‌ను 15 నిమిషాల్లోనే 50 శాతం, 46 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్‌ను పూర్తి చేయ‌వ‌చ్చు. ఇక ఈ ఫోన్ ధ‌ర కూడా తక్కువ‌గానే ఉంది.

రెడ్‌మీ కె50ఐ స్మార్ట్ ఫోన్‌ను ఫాంట‌మ్ బ్లూ, స్టెల్త్ బ్లాక్‌, క్విక్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ చేయ‌గా.. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.25,999 ఉంది. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.28,999గా ఉంది. దీన్ని ఎంఐ ఆన్ లైన్ స్టోర్‌, అమెజాన్‌, ఎంఐ హోమ్ స్టోర్‌, ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్‌ల‌లో జూలై 23వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ కార్డుల‌తో రూ.3వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2500 వ‌ర‌కు అద‌న‌పు బోన‌స్ ల‌భిస్తుంది. కె20 ప్రొ ఫోన్‌కు అయితే అద‌నంగా రూ.8050 పొంద‌వ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌ను కొన్న‌వారికి ఐసీఐసీఐ కార్డుల‌తో షియోమీ స్మార్ట్ స్పీక‌ర్‌పై రూ.3వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now