గురువారం, జూన్ 11, 2026
క్రికెట్

అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?

భారత మాజీ క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?
యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆటతీరుపై తన విశ్లేషణను పంచుకున్న రవిచంద్రన్ అశ్విన్. Photo Credit: Cricket Addictor.
Ravichandran Ashwin discussing Abhishek Sharma's batting form in T20 World Cup.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆటతీరుపై తన విశ్లేషణను పంచుకున్న రవిచంద్రన్ అశ్విన్. Photo Credit: Cricket Addictor.

భారత మాజీ క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్‌కు టోర్నమెంట్‌లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగింది. అతని స్కోర్లు వరుసగా 0, 0, 0, 15, 55, 10, 9 గా నమోదయ్యాయి. మొత్తంగా అతను 89 పరుగులు మాత్రమే చేసి సగటు 12.71 తో ఉన్నాడు. ఈ క్ర‌మంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ తన యూట్యూబ్ ఛానల్ యాష్ కీ బాత్ లో మాట్లాడిన అశ్విన్.. అభిషేక్‌ను ఫైనల్‌కు తప్పక కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే జట్టు మేనేజ్‌మెంట్ అతనితో పరిస్థితికి అనుగుణంగా ఎలా ఆడాలో చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారు.

2 బౌండరీలు కొట్టాక మ‌ళ్లీ బాదడం ఎందుకు..?

అభిషేక్ శర్మలో ప్రత్యేక ప్రతిభ ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గతంలో మిచెల్ శాంట్‌న‌ర్‌, మ్యాట్ హెన్రీపై కూడా బాగా ఆడాడు. అందుకే అతని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. కానీ అతనితో మాట్లాడాలి. ప్రత్యర్థులు అతనిపై ప్రత్యేక ప్రణాళికతో వస్తున్నారని చెప్పాలి. బంతిని బలంగా కొట్టాలని ఎక్కువగా ప్రయత్నించకూడదు.. అని అశ్విన్ చెప్పారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌ను అశ్విన్ త‌ల లేకుండా ఆడిన బ్యాటింగ్ గా అభివర్ణించారు. జాక్స్‌పై ఇప్పటికే రెండు బౌండరీలు కొట్టిన తర్వాత కూడా పెద్ద షాట్ కు ప్రయత్నించడం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అతను జాక్స్‌పై 8 పరుగులు చేశాడు. కానీ 30 పరుగులు చేయాలని ప్రయత్నించాడు. కొన్నిసార్లు బంతిని వదిలేయాలి. మరోవైపు సంజు శాంస‌న్ అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి ఒక సింగిల్ తీసుకుని స్ట్రైక్ అతనికి ఇవ్వాల్సింది. తర్వాత నీకు అవకాశం వస్తుంది.. అని అశ్విన్ పేర్కొన్నారు.

అభిషేక్‌ను ఆడించాలి..

అశ్విన్ మరోవైపు భారత జట్టు కోచ్ గౌతం గంభీర్‌, కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ లకు కూడా ఒక సూచన చేశారు. అభిషేక్‌పై అధిక ఒత్తిడి పెంచకూడదని ఆయన చెప్పారు. అభిషేక్ అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. కానీ అతనితో జట్టు ఎలాంటి చర్చలు చేస్తోంది అన్నది తెలుసుకోవాలని ఉంది. అతనిపై ఎక్కువ ఒత్తిడి పెడితే బంతిని మరింత బలంగా కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను టైమింగ్‌పై ఆధారపడే ఆటగాడు. కాబట్టి అతనిని ప్రశాంతంగా ఉంచాలి. నేను అయితే అతనిని జట్టులో కొనసాగిస్తాను.. అని అశ్విన్ తెలిపారు. అయితే అభిషేక్ శ‌ర్మ వ‌రుస‌గా ఫ్లాప్ అవుతుండ‌డంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌తో ఎలా ఆడుతాడోన‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి అభిషేక్ పెర్ఫార్మెన్స్ చివ‌రి మ్యాచ్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి