Ravi Teja : ర‌వితేజ జోరుకు అడ్డే లేదు.. కొత్త సినిమా టైటిల్‌తోపాటు పోస్ట‌ర్ విడుద‌ల‌..

November 5, 2021 11:07 AM

Ravi Teja : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ జోరుకి అడ్డే లేదు. ఒక‌వైపు వ‌రుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ర‌వితేజ మ‌రోవైపు కొత్త సినిమాలు ప్ర‌క‌ట‌న చేస్తున్నాడు. అంత‌టితో ఆగుతున్నాడా.. టైటిల్స్ , సినిమా పోస్ట‌ర్స్ అంటూ నానా ర‌చ్చ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ర‌వితేజ ప్ర‌క‌టించిన సినిమాల‌కు సంబంధించి టైటిల్స్, ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల‌య్యాయి. తాజాగా రావ‌ణాసుర అనే టైటిల్ త‌న 70వ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశాడు.

Ravi Teja new movie ravanasura announced poster look
Ravi Teja new movie ravanasura announced poster look

కొద్ది రోజుల క్రితం సినిమా ప్ర‌క‌ట‌న చేయ‌గా, తాజాగా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలు ఆల్రెడీ అనౌన్స్ చేసిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం.

ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన.. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు.  ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. మ‌రోవైపు  వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now