Ravi Teja Khiladi Movie Review : ర‌వితేజ ఖిలాడి మూవీ రివ్యూ..!

February 11, 2022 1:15 PM

Ravi Teja Khiladi Movie Review : ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ హీరోగా, మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తిలు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. ఖిలాడి. ఇందులో అన‌సూయ‌, ముర‌ళీ శ‌ర్మ‌, ముఖేష్ రుషి, అర్జున్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌లు పోషించారు. కోనేరు స‌త్యానార‌య‌ణ నిర్మించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిచారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా వారిని ఎలా అలరించిందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Ravi Teja Khiladi Movie Review
Ravi Teja Khiladi Movie Review

క‌థ‌..

పూజ (మీనాక్షి చౌద‌రి) ఒక సైకాల‌జీ స్టూడెంట్‌. ఆమె ఇంటెలిజెన్స్ ఐజీ కుమార్తె. ఓ థీసిస్ కోసం సెంట్ర‌ల్ జైల్‌లో ఖైదీల‌ను క‌లుస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే జైలులో ఖైదీగా ఉన్న మోహ‌న్ గాంధీ (ర‌వితేజ‌)ను ఆమె క‌లుస్తుంది. అయితే మోహ‌న్ అన్నీ ఆమెకు మాయ‌మాట‌లు చెబుతాడు. దీంతో అవ‌న్నీ నిజ‌మే అని న‌మ్మిన పూజ త‌న తండ్రి సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి మ‌రీ మోహ‌న్‌కు బెయిల్ వ‌చ్చేట్లు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ మోహ‌న్ త‌న అస‌లు రంగు బ‌య‌ట పెడ‌తాడు. అత‌ను ఒక క్రిమిన‌ల్ అని పూజ‌కు తెలుస్తుంది. హోం మంత్రికి ఇట‌లీ నుంచి వ‌చ్చిన రూ.10వేల కోట్ల‌ను కొట్టేయ‌డం కోస‌మే అత‌ను డ్రామా ఆడాడ‌ని.. అందుకు గాను త‌న‌ను పావులా వాడుకున్నాడ‌ని.. పూజ‌కు తెలుస్తుంది. దీంతో పూజ ఏం చేసింది ? అస‌లు ఆ రూ.10వేల కోట్లు ఎవ‌రివి ? ఎక్క‌డ ఉంటాయి ? మోహ‌న్‌ను మ‌ళ్లీ పోలీసులు ప‌ట్టుకుంటారా ? అస‌లు అత‌ని ల‌క్ష్యం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. వెండితెర‌పై ఈ సినిమాను చూడాల్సిందే.

ఇక మూవీలో న‌టీనటుల పెర్ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే.. ర‌వితేజ డ్యుయ‌ల్ షేడ్స్‌లో క‌నిపించి మ‌రోసారి అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఇత‌ర నటీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర న‌టించారు. సినిమాలో ఉండే ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను అల‌రింప‌జేస్తాయి. కానీ కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఏమాత్రం ఆక‌ట్టుకోవు. కొన్ని సీన్లు అయితే విసుగు తెప్పిస్తాయి. ఇక హీరోయిన్ల అందాల ప్ర‌ద‌ర్శ‌న ఒక రేంజ్‌లో ఉంటుంది. ట్రైల‌ర్‌లోనే మ‌సాలా చూపించేశారు. అలాగే పాట‌లు బాగుంటాయి. ఫైట్స్‌ను కూడా ర‌వితేజ‌కు త‌గిన‌ట్లుగా రూపొందించారు. ఈ క్ర‌మంలో సినిమాను రిచ్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌తో తీసిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

అయితే మొత్తంగా చెప్పాలంటే ర‌వితేజ యాక్ష‌న్‌, హీరోయిన్ల గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌, పాట‌లు, ఫైట్స్‌.. వంటి అంశాల కోసం అయితే ఈ మూవీని ఒక్క‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. క‌థ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా సినిమాను సినిమాలా చూస్తే ఈ మూవీ విజ‌యం సాధించ‌డం ప‌క్కా అని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఏది ఏమైనా ఈ రెండు రోజులు ప్రేక్ష‌కులు ఇచ్చే తీర్పుపై ఈ మూవీ స‌క్సెస్ ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now