గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rashmika Mandanna : ఎగిరెగిరి తంతున్న రష్మిక.. అలా అడుగుతారా.. అంటూ.. కామెంట్స్‌ చేస్తున్న నెటిజన్లు..!

Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా…

Rashmika Mandanna : ఎగిరెగిరి తంతున్న రష్మిక.. అలా అడుగుతారా.. అంటూ.. కామెంట్స్‌ చేస్తున్న నెటిజన్లు..!

Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఇంట్లో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే రష్మిక ఎక్కువగా జిమ్ లో గడుపుతూ తన ఫిట్‌ నెస్‌ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా సోషల్ మీడియా వేదికగా రష్మిక షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rashmika Mandanna workout kicking video viral

ఈ వీడియోలో భాగంగా రష్మిక తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి ఎంతో కుస్తీ పడుతోంది. ఇందులో ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను రష్మిక ఎగిరెగిరి పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఇలా రష్మిక తంతు ఉంటే తన ట్రైనర్ ఇంకాస్త గట్టిగా తన్ను అంటూ చెబుతున్న ఈ వీడియోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయటంతోపాటు కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను ? అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

https://www.instagram.com/reel/CVXAUXNqvDX/?utm_source=ig_embed&utm_campaign=loading

ఈ వీడియో చూసిన నటుడు, దర్శకుడు ఎవరైనా నిన్ను మరొక టేక్ కావాలని అడుగుతారా.. అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ప్రస్తుతం పుష్ప అనే చిత్రంలో ఎంతో బిజీగా ఉంది. శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి