Rashmika Mandanna : జోరు మీదున్న ర‌ష్మిక మంద‌న్న‌.. హైద‌రాబాద్‌లో భారీ ఖ‌ర్చుతో ఇల్లు కొనుగోలు..?

February 3, 2022 1:35 PM

Rashmika Mandanna : వ‌రుస సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. ఈమె న‌టిస్తున్న సినిమాలు అన్నీ బంప‌ర్ హిట్ అవుతున్నాయి. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ సినిమాల్లో ర‌ష్మిక‌ను తీసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను సాధించిన పుష్ప మూవీలో ర‌ష్మిక మంద‌న్న శ్రీ‌వ‌ల్లిగా న‌ట‌న‌ను ఇర‌గ‌దీసింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆమెకు వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌స్తుతం ఆమె కెరీర్ జోరు మీదుంది.

Rashmika Mandanna  reportedly bought new house with huge money
Rashmika Mandanna

ఇక ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే చిత్రాల ద్వారా ఆమె బాలీవుడ్ తెర‌కు పరిచ‌యం కానుంది. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అయితే దాదాపు అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తున్న ర‌ష్మిక‌కు అనేక న‌గ‌రాల‌కు తిర‌గ‌డం క‌ష్టంగా మారింద‌ట‌. దీంతో ఆమె ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో సొంత ఇళ్ల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే ముంబైలో ఓ పోష్ ఏరియాలో ఇంటిని కొనుగోలు చేయ‌గా.. తాజాగా హైద‌రాబాద్‌లోనూ మ‌రో ఇంటిని కొన్న‌ద‌ట‌. ఇందుకు గాను ఆమె భారీగానే ఖ‌ర్చు చేసింద‌ని స‌మాచారం. హైద‌రాబాద్‌లోని ఓ లగ్జ‌రీ ఏరియాలో ఆమె ఇంటిని కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ఆమె ప‌లు భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో న‌టిస్తుండ‌డంతో.. ఎక్కువ‌గా ఆయా న‌గ‌రాల‌కు తిర‌గాల్సి వ‌స్తోంది. దీంతో ఆమెకు స్టే చేసేందుకు హోట‌ల్స్ ప‌డ‌డం లేదట‌. అందుక‌నే ఆయా సిటీల్లో ఇళ్ల‌ను కొనుగోలు చేసింద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ చిత్రాల‌తోపాటు పుష్ప రెండో భాగంలో న‌టిస్తోంది. ఏది ఏమైనా 2021, 2022 సంవ‌త్స‌రాలు ర‌ష్మిక‌కు బాగా క‌ల‌సి వ‌చ్చాయ‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment