Rashmika Mandanna : టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరు ? అని అడిగితే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. రష్మిక మందన్న. ఈ భామ గతేడాది కాలంగా వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే నేషనల్ క్రష్‌గా ఉన్న ఈమె పుష్ప అందించిన ఊపుతో బాలీవుడ్‌లోనూ పాగా వేస్తోంది. పలు వరుస సినిమాలతో ఈమె బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలోనూ రష్మిక ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందులో పోస్ట్ చేస్తుంది. ఇక తాజాగా ఓ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థకు ఆమె యాడ్ చేసింది. అందులో డ్యాన్స్ ఇరగదీసింది.
డ్యాన్స్ త్రూ లైఫ్ పేరిట ఆమె చేసిన ఓ మ్యూజిక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ పాప్ సాంగ్‌కు రష్మిక స్టెప్స్ వేయడాన్ని చూడవచ్చు. ఆ బ్రాండ్‌కు ఆమె ప్రమోటర్‌గా ఉంది. అందుకనే ఈ యాడ్‌లో నటించింది. ఇక ఈ మ్యూజిక్ వీడియోను ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
కాగా రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ఈమె త్వరలోనే పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొననుంది. ఈ మధ్యే ఈమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు. ఇక మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాల్లో ఈమె నటిస్తుండగా.. సందీప్ రెడ్డి వంగా చేయబోతున్న యానిమల్ అనే హిందీ మూవీలోనూ ఈమె చాన్స్ కొట్టేసింది.
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…