Rashmika Mandanna : అదేంటి రష్మిక.. కింద ఏమైనా వేసుకోవడం మర్చిపోయావా.. నేషనల్ క్రష్ పై నెటిజన్స్ ట్రోల్స్..!

September 24, 2022 4:33 PM

Rashmika Mandanna : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావ‌డానికి కొంత టైం ప‌డుతుంది. అదే కొంద‌రు మాత్రం ఒక‌టీ రెండు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్పతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది.

త్వరలోనే బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గుడ్‌బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్‌ మజ్ను అనే మూవీకి కూడా సైన్ చేసింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ముంబైకు వెళ్లాక చాలా మారిపోయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసినప్పుడు ఇలా లేదని.. నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉండాలా ? అని కొందరు సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Mandanna bollywood movie netizen troll
Rashmika Mandanna

పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక అందాల ఆరబోత మాములుగా లేదు. డీ గ్లామర్ రోల్ లో ఎద అందాలతో యూత్ కి మత్తెక్కిచ్చింది. ఇక రష్మిక అందాలను చూసి బాలీవుడ్ కుర్రకారు రష్మిక జపం చేస్తున్నారట. ప్రస్తుతం రష్మిక చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వరుస బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ముంబైలో మెరిసింది. లైట్ పింక్ చెక్స్ గౌను ధరించిన రష్మిక.. తొడలు కనిపించేలా దుస్తులు ధరించడంతో కింద ఏమైనా వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now