Rashmika Mandanna : నువ్వా నేనా అనుకుంటున్న సమంత, రష్మిక.. ఇద్దరి మధ్య ఓ రేంజ్ ఫైట్..!

July 28, 2022 9:57 PM

Rashmika Mandanna : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. నేషనల్ క్రష్ రష్మికల మధ్య సంథింగ్ ఏదో జరుగుతుందని అందనూ అనుకుంటున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి నేషనల్ క్రష్ గా మారిన రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్పతోపాటు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తోంది రష్మిక. అమితాబ్ తో గుడ్ బై.. సిద్ధార్థ్ మల్ హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలు చేస్తున్న రష్మిక ఈ రెండిటితోపాటు సందీప్ వంగ డైరక్షన్ లో వస్తున్న యానిమల్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలతో బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది రష్మిక.

అయితే రష్మిక ప్లాన్ ఇలా ఉంటే సమంత దాన్ని మించిన ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నంబర్ 1 ప్లేస్ లో ఉన్న సమంత ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్ లో కొద్దిగా వెనకపడ్డది. ఇక ఇప్పుడు డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత బాలీవుడ్ వైపు కూడా కన్నేసింది. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటించి మెప్పించింది. ఆ వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ చేసి మరీ షాక్ ఇచ్చింది. ఇక వీటితోపాటు మరిన్ని ఆఫర్లు పొందుతోంది. ఈమధ్యనే ఆర్ మాక్స్ సంస్థ చేసిన సర్వేలో కూడా సమంత నెంబర్ 1 అని ఎనౌన్స్ చేసింది. అయితే నేషనల్ క్రష్ రష్మికకి మరింత షాక్ ఇవ్వనుందట.

Rashmika Mandanna and Samantha compete each other with films
Rashmika Mandanna

తాను చేస్తున్న సినిమాలతో ఇప్పుడు రష్మిక హడావిడి చేస్తుండగా ఇప్పుడు సమంత కూడా రష్మికకు గట్టి షాక్ ఇచ్చేలా సమంత తను చేసే సినిమాలకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ లను కూడా ఒకేలా ఇచ్చేలా ప్లాన్ చేస్తోందట. మంచి ఫాం లో ఉన్న రష్మిక.. సమంత చేజిక్కించుకుంటున్న సినిమాలను చూసి ఒకింత అసూయ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే సమంత ఎన్ని సినిమాలు చేసినా రష్మికకు.. రష్మికకు ఎన్ని సినిమాలు చేసినా సమంతకి ఏమీ జరగదు. ఎవరి లక్ బాగుంటే వారికి ఛాన్సులు వస్తాయి. ఎవరి టాలెంట్ నచ్చితే వారికి అవకాశాలు ఇస్తారు. ఇద్దరూ టాలెంటెడ్ హీరోయిన్స్ కాబట్టే అవకాశాల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now