Rashmi Gautam : నువ్వు అలా చేస్తా అంటే.. నేను అన్నీ వదిలేసి ఇప్పుడే వచ్చేస్తా.. యాంకర్ రష్మి కామెంట్స్ వైర‌ల్‌..

September 18, 2022 2:37 PM

Rashmi Gautam : సోషల్ మీడియా వాడకం పెరిగాక నెటిజన్స్ కామెంట్స్ కి హద్దు అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్, స్టార్ యాంకర్స్ ని పబ్లిక్ గా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ పరువు తీస్తున్నారు. ఇలా చాలామంది హీరోయిన్స్ కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి, హీరోలకి అందరికీ జరిగింది. ఇటీవల సీనియర్ యాంకర్ అనసూయను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఆంటీ అంటూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జబర్ధస్త్ యాంకర్ రష్మికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. బుల్లితెరపై యాంకర్‏గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్.

చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో రష్మి చేసే పోస్టులకు విపరీతమైన స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన రష్మికి నెటిజన్స్ నుంచి భయంకరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

Rashmi Gautam said she will do acting if movie makes
Rashmi Gautam

ఓ నెటిజన్.. రష్మి నువ్వు ఆ పనికిమాలిన చెత్త షోస్ ఎందుకువచేస్తున్నవ్.. హీరోయిన్ గా ట్రై చేయొచ్చుగా అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి రష్మీ రిప్లై ఇస్తూ.. నా దగ్గర మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. నేను హీరోయిన్ గా నటిస్తాను. నువ్వు సినిమా నిర్మిస్తావా చెప్పూ.. ఇప్పుడే యాంకరింగ్ మానేసి వస్తాను అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్ ఏమి చెప్పలేక సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం రష్మి ఆన్సర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇలానే ఉండాలి, ఇలాంటి తప్పుడు ప్రశ్నలు అడిగే వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇస్తేనే కరెక్ట్ అంటూ రష్మిని పొగిడేస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now