Rashmi Gautam : రష్మి గౌతమ్‌ నన్ను బెదిరించింది.. ఆమె గుట్టు రట్టు చేసిన ప్రొడ్యూసర్..

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన రష్మి గురించి అందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఆమె తనను బెదిరించిందని తాజాగా ఓ నిర్మాత ఆమె విషయాలను బయటపెట్టారు. దీంతో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

Rashmi Gautam

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలాజీ నాగలింగం అనే ఓ ప్రొడ్యూసర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మి గురించి విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఒక వ్యక్తిని తిట్టాము అంటే వారి వల్ల మనం ఎంత బాధ పడి ఉంటామో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. రష్మి గుంటూరు టాకీస్ సినిమా చేస్తున్న సమయంలో శ్రీ లక్ష్మీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించి నేను నా స్నేహితుడు కలిసి రష్మి ప్రధాన పాత్రలో ఒక సినిమా చేయాలని భావించాము.

ఈ విధంగా రష్మితో ఆమె రెమ్యునరేషన్ గురించి అన్ని విషయాలు మాట్లాడి సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇక చివరిలో ఒక సాంగ్, డబ్బింగ్ పార్ట్‌ మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో తాను షూటింగ్ కి రానని, హీరోని మార్చాలంటూ రష్మి డిమాండ్ చేసింది. ఆ సమయంలో తనతో మాట్లాడగా తనకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు.. అంటూ వారి పేర్లు చెబుతూ నన్ను బెదిరించిందని ఆయన తెలియజేశారు.

నేను కూడా ఇండస్ట్రీలోనే ఉన్నవాడిని అని.. నాకు నాగబాబు , శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియదా.. ఆ రోజు రష్మి నాతో మాట్లాడిన మాటలు అన్నీ నా దగ్గర రికార్డు చేయబడి ఉన్నాయి. అప్పుడు నేను రష్మిని ఫిలిం చాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న మాట నిజమే. నేను కేవలం నిజం చెప్పాలని మాత్రమే బెదిరించాను. నిజాయితీగా ఉండమని చెప్పాను.. అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా బాలాజీ నాగలింగం రష్మి గురించి వెల్లడించారు. ఇలా చివరిలో పేచీ పెట్టుకున్న రష్మి మూడు నెలలపాటు షూటింగ్‌ కి రాలేదని, ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెనే మళ్లీ వచ్చి షూటింగ్‌ కంప్లీట్‌ చేసిందని.. తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఈయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్‌దీప్‌కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…

Wednesday, 11 March 2026, 2:59 PM

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM