Sudigali Sudheer : సుధీర్‌కు ఏం ఇస్తావు ? అని అడగ్గానే మెలికలు తిరిగిపోయిన రష్మి..!

March 17, 2022 8:42 AM

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, రష్మి ఎక్కడ ఉంటే అక్కడ వినోదం ఉంటుందనే చెప్పాలి. ఇలా వీరిద్దరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పలు కార్యక్రమాలలో నిర్వాహకులు వీరి చేత సందడి చేయిస్తుంటారు. ఈటీవీలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని సందడి చేసిన సుధీర్, రష్మీ ఉన్న  ఫలంగా ఈటీవీ నుంచి మాయమై స్టార్ మాలో ప్రత్యక్షమయ్యారు. స్టార్ మాలో ఈ హోలీకి తగ్గేదేలే.. అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

Rashmi Gautam asked by Ravi what she will give to Sudigali Sudheer
Sudigali Sudheer

ఈ విధంగా చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై సుధీర్, రష్మీ సందడి చేశారు. ఈ క్రమంలోనే సుధీర్.. రష్మి కోసం అద్భుతమైన పాటను పాడాడు. వీరి మధ్య ఉన్న గూడుపుఠాని బయటకు లాగడం కోసం రవి తెగ ప్రయత్నాలు చేశాడు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. ఒకవేళ రష్మీ.. సుధీర్ కి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తావు.. అని అడిగాడు. దీంతో రష్మి తెగ సిగ్గు పడుతూ మెలికలు తిరుగుతూ ఇవ్వమంటావా అని అడగగా వెంటనే సుధీర్ కెమెరా ముందు ఇచ్చేదేనా.. అంటూ రష్మీపై పంచ్ వేశాడు.

ఇక సుధీర్ ఫోన్ నంబర్ రష్మీ ఫోన్ లో ఎలా సేవ్ చేసుకుందని రవి ప్రశ్నించాడు. దీంతో ర‌ష్మీ తెగ సిగ్గుప‌డిపోయింది. ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ కార్యక్రమంపై అంచనాలను పెంచేసింది. మరి వీరి మధ్య జరిగే పూర్తి ఫన్ చూడాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే రోజు వరకు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now