Rashi Khanna : ర‌ష్యాలో మంచు వాతావ‌ర‌ణంలో నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా.. ఎంజాయ్‌..!

January 28, 2022 12:49 PM

Rashi Khanna : విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం.. థాంక్ యూ. ఇందులో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తుండ‌గా.. ఆయ‌న ప‌క్క‌న రాశీ ఖ‌న్నా హీరోయిన్‌గా చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

Rashi Khanna and naga chaitanya enjoy in Russia Masco cold weather

ఇందులో భాగంగానే తాజాగా ర‌ష్యాలో మంచు వాతావ‌ర‌ణంలో ఈ మూవీకి చెందిన కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మ‌నం సినిమా ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

రష్యా రాజ‌ధాని మాస్కోలో ప్ర‌స్తుతం వీధుల్లో మంచు కురుస్తోంది. ఆ వాతావ‌ర‌ణంలో ఈ చిత్రానికి చెందిన ప‌లు ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌ష్యా మంచు వాతావ‌ర‌ణంలో నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఫొటోల‌ను రాశీ ఖ‌న్నా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ.. ఎముక‌లు కొరికే గ‌డ్డ క‌ట్టించే చ‌లిలో మైన‌స్ 14 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లో చిత్ర షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలియ‌జేసింది. థాంక్ యూ చిత్రం ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల కానుంది. ఇందులో నాగ‌చైత‌న్య ఓ కార్పొరేట్ యువ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now