Ranbir Kapoor : ప్రేయసితో బర్త్ డే పార్టీలో రణబీర్.. ఒక రాత్రికి ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

September 29, 2021 6:54 PM

Ranbir Kapoor : బాలీవుడ్ ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ జంట ఏ మాత్రం ఖాళీ దొరికినా విహారయాత్రలు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది పెళ్లి ద్వారా ఒకటవ్వాలని భావించారు. అయితే గత ఏడాది రణబీర్ కపూర్ తండ్రి మృతి చెందడంతో వీరి పెళ్లి కాస్తా వాయిదా పడింది. ఇక తాజాగా రణబీర్ పుట్టినరోజు కావడంతో అభిమానులు చెప్పిన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ranbir Kapoor : ప్రేయసితో బర్త్ డే పార్టీలో రణబీర్.. ఒక రాత్రికి ఎంత ఖర్చు చేశారో తెలుసా ?
Ranbir Kapoor

హ్యాపీ బర్త్‌ డే మై డియర్ లైఫ్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్‌ 28న రణబీర్‌ కపూర్‌ పుట్టిన రోజు కావడంతో ఈ జంట ఒకరోజు ముందుగానే జోధ్‌పూర్‌లోని సుజన్‌ జవాయి క్యాంప్‌కి చేరుకుంది. అక్కడ తన ప్రేయసి, తన స్నేహితులతో కలిసి రణబీర్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

రాత్రి తన ప్రేయసితో కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి రిట్రీట్‌ యాజమాన్యం రూ .75వేల నుంచి రూ.1.65 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ జంట ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. అదే విధంగా ఆలియా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now