Rana Daggubati : రానా లిప్ లాక్ వెనుక ఎంత రచ్చ జరిగిందో తెలుసా.. ఆయన భార్య మిహికా ఏమందంటే..?

September 25, 2022 8:47 PM

Rana Daggubati : రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా దగ్గుబాటి మాత్రం ఇంకా స్టార్ హీరో బేస్ సంపాదించుకోలేదనే చెప్పవచ్చు. మంచి నటుడిగా రానాకు ఫుల్ మార్క్స్ పడ్డప్పటికీ, స్టార్ హీరో అనేట‌ప్పటికి ఆలోచించాల్సి వస్తుంది. అందుకు రానా సెలెక్ట్ చేసుకునే స్టోరీలే కారణంగా చెప్పవచ్చు. మొదట‌ లీడర్, కృష్ణం వందే జగద్గురం, ఘాజీ వంటి సినిమాలతో రానాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన బాహుబలి వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అవ్వడంతో రానా భ‌ల్లాల దేవుడిగా అందరికీ గుర్తుండిపోయాడు. ఇంత గుర్తింపు వచ్చిన తరువాత రానా కెరీర్ అద్భుతంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఏర్ప‌డింది.

కానీ హీరో కన్నా విలన్ పాత్రలనే ఎక్కువ ఎంపిక‌ చేసుకుంటూ టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ విలన్ గా సెటిల్ అయిపోయాడు. రీసెంట్ గా రానా దగ్గుబాటి డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన బాబాయ్ వెంకటేష్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. దీనికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఒరిజినల్ గా నిర్మితమవుతున్న రానా నాయుడు అనే వెబ్ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. కచ్చితంగా ఈ సిరీస్‌లో వెంకటేష్ నటనకి మంచి మార్కులు పడే అవకాశం ఉంది.

Rana Daggubati latest web series promo video viral
Rana Daggubati

అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి హద్దులు మీరి నటించినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో రానా లిప్ కిస్సులతో రెచ్చిపోయాడు. వాస్తవానికి రానా లిప్ కిస్ కి, బెడ్ సీన్స్ కి, బోల్డ్ సన్నివేశాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. కానీ ఈ కంటెంట్ లో భాగంగానే రానా దగ్గుబాటి అలా చేశాడని తెలుస్తుంది. అంతేకాదు దీనిపై ముందుగానే ఆయన భార్య మిహికాకు చెప్పడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రానా దగ్గుబాటి అలా ఆమెతో లిప్ లాక్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ద్వారా అబ్బాయ్, బాబాయ్ ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now