Rana Daggubati : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. సమంత ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటి నుంచి ఇలాంటి వార్తలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే రానా విడాకుల మ్యాటర్ వైరల్ అయింది. యంగ్ హీరో రానా కూడా విడాకుల దిశగా అడుగులేస్తున్నాడంటూ ఓ రేంజ్ రూమర్స్ షికారు చేశాయి. దీనికి కారణం రానా తన సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్టులు డిలీట్ చేయడమే. దీంతో మిహికాకి, రానాకి మధ్య గొడవ జరిగిందంటూ ప్రచారాలు మొదలయ్యాయి.
రానా సోషల్ మీడియా నుంచి బయటకు రావడానికి అదే కారణమని, అచ్చం సమంత లాగే ఆయన కూడా నెమ్మదిగా హింట్ ఇస్తున్నారని అంతా అనుకున్నారు. ఈ విషయంలో ఇద్దరూ డైరెక్ట్ గా స్పందిస్తే బాగుంటుంది అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ లో.. మాట్లాడకుండానే క్లారిటీ ఇచ్చేసింది రానా భార్య మిహికా బజాజ్. దీంతో జరుగుతున్న ఈ ప్రచారానికి మిహికా బజాజ్ ఫుల్ స్టాప్ పెట్టింది. విడాకుల రూమర్స్ వార్తలకు చెక్ పెడుతూ.. తమ సెకండ్ యానివర్సరీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాము విడాకులు తీసుకోవడం లేదనే వార్తను ఆమె చెప్పకనే చెప్పినట్టయింది. అయితే సినీ జనాలు మాత్రం చిన్న కన్ ఫ్యూజన్ లోనే ఉన్నారు. టాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ.. అటు హీరోగా, ఇటు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ చూపిస్తున్నాడు రానా దగ్గుబాటి. తన స్నేహితురాలు మిహికా బజాజ్ ను 2020 లో ఆయన పెళ్ళాడాడు. చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి టైమ్ వరకూ వీరి ప్రేమను సీక్రెట్ గా ఉంచాడు రానా.
ఈ మధ్య చిత్ర పరిశ్రమలో విడాకులు సాధారణం అయిపోయాయి. మఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు కొంత కాలానికే విడిపోతున్నారు. చై- సామ్, ధనుష్- ఐశ్వర్య లాంటి వారు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రానా, మిహికాలు కూడా విడిపోతున్నట్టుగా ప్రచారం చేశారు. కానీ వాటన్నింటికీ మిహికా ఒక్క ఫోటోతో చెక్ పెట్టింది. అయితే ఇది ఇక్కడితో ముగుస్తుందా.. లేక రానున్న రోజుల్లో మళ్లీ ఏదైనా జరుగుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…