Ramya Krishnan : అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.
తాజాగా రమ్యకృష్ణ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ నటనతో అదరగొట్టారు. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వయసుకి తగ్గ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు రమ్యకృష్ణ గ్లామర్ కి, ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ కి యువత పడి పోయేవారు.
ప్రస్తుతం ఓంకార్ నిర్వహించే ఐకాన్ డ్యాన్స్ షోకి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో తన గురించి ఒక సీక్రెట్ ని రమ్యకృష్ణ బయట పెట్టేశారు. ఐకాన్ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్లు రమ్యకృష్ణ నటించిన ఒక చిత్రంలోని సాంగ్ కి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఇంతకీ ఆ సాంగ్ ఏదంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నా అల్లుడు చిత్రంలోని సయ్యా సయ్యారే అనే మాస్ సాంగ్.
ఈ షోలో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసిన కంటెస్టెంట్లును రమ్యకృష్ణ అభినందిస్తూ.. ఈ సాంగ్ కి డ్యాన్స్ చేసే సమయంలో నేను నాలుగు నెలల గర్భవతిని అంటూ తెలిపారు. అందుకే ఈ పాటని నేను అంత త్వరగా మరచిపోలేను. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు, ఎనర్జీ మరో స్థాయిలో ఉంటాయి అని రమ్యకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2005లో విడుదలైన నా అల్లుడు చిత్రంలో ఎన్టీఆర్ సరసన జెనీలియా, శ్రీయ శరన్ జంటగా నటించారు. ఈ చిత్రం అప్పటిలో ఆశించిన మేరకు ఫలితం సాధించలేకపోనా సయ్యా సయ్యారే సాంగ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీయ మరియు జెనీలియాకు తల్లిగా, పొగరు బోతు అత్తగా రమ్యకృష్ణ నటించింది. ఈ పాటలో ఎన్టీఆర్ తో రమ్యకృష్ణ, శ్రీయ, జెనీలియా ముగ్గురూ కలిసి డ్యాన్స్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…