Ramya Krishnan : డ్యాన్స్ షో ఒక్క ఎపిసోడ్‌కు ర‌మ్య‌కృష్ణ రెమ్యున‌రేష‌న్ అంత‌నా.. వామ్మో..

September 20, 2022 7:14 AM

Ramya Krishnan : టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి, మెప్పించారు. రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా ఆకట్టుకున్నారు  రమ్యకృష్ణ. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.

తాజాగా రమ్యకృష్ణ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ నటనతో అదరగొట్టారు. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇదిలా ఉండగా డిజిటల్‌ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా. ఇందులో భాగంగా నాన్‌-ఫిక్షన్ కేటగిరీలో మరోసారి తన ప్రత్యేకత చాటుకునేందుకు డ్యాన్స్‌ షోతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది.

Ramya Krishnan remuneration per episode in aha dance show
Ramya Krishnan

డ్యాన్స్‌ ఐకాన్‌ పేరుతో నిర్వహించబోతోన్న ఈ షోకు ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షోకు న్యాయనిర్ణేతగా లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ వ్యవహరించనున్నారు. ఈ డ్యాన్స్‌షోతో తొలిసారిగా డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టనున్నారు రమ్యకృష్ణ. అయితే ఈ షోలో జడ్జ్ గా వ్యవహరించేందుకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రమ్యకృష్ణ ఒక్కో ఎపిసోడ్ కి రూ.4.5 లక్షలు తీసుకుంటున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ఎవరూ తీసుకోనంత పెద్ద మొత్తం శివగామి తీసుకుంటున్నట్టే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now