Ramarao On Duty Movie Review : మాస్ మ‌హారాజ ర‌వితేజ‌.. రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

July 29, 2022 10:18 AM

Ramarao On Duty Movie Review : టాలీవుడ్‌లో అనేక మంది హీరోలు ఉన్నా.. వారిలో ర‌వితేజ‌ది ప్ర‌త్యేక‌మైన శైలి అని చెప్ప‌వ‌చ్చు. ఈయ‌న మాస్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటారు. ఇక తాజాగా ఆయ‌న న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీనికి శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అలాగే వేణు తొట్టెంపూడి మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఇక ఇప్ప‌టికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్ట‌ర్లు, సాంగ్స్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీగానే అంచ‌నాలు పెరిగిపోయాయి.

ఇక ర‌వితేజ సినిమా అంటే ఆయ‌న డైలాగ్స్ ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే భారీ అంచ‌నాల‌తో రామార‌వు ఆన్ డ్యూటీ అనే మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Ramarao On Duty Movie Review
Ramarao On Duty Movie Review

క‌థ‌..

ఈ మూవీలో ర‌వితేజ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించారు. ఆయ‌న పాత్ర ప్రేక్ష‌కుల‌కు అద్బుతంగా క‌నిపిస్తుంది. అయితే ర‌వితేజ ఒక‌ విష‌యంలో స‌బ్ కలెక్ట‌ర్ ఉద్యోగాన్ని వ‌దులుకొని ఊరికి వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో ర‌వితేజ త‌న ఊరిలో కొంద‌రు మిస్సింగ్ అయిన విష‌యాన్ని తెలుసుకుంటాడు. వారంద‌రినీ కాపాడుకునే క్ర‌మంలో ర‌వితేజ ఎలాంటి ప్లాన్స్ వేశాడు, ఆయ‌న ఎదుర్కొన్న ప‌రిస్థితులు ఏమిటి.. చివ‌ర‌కు ఏమ‌వుతుంది.. అన్న వివ‌రాలు తెలియాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌..

తొలిసారిగా ర‌వితేజ ఈ చిత్రంలో భిన్న పాత్ర‌లో న‌టించార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీలో ఆయ‌న డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా అద్భుత‌మైన పంచ్ డైలాగ్స్‌తో అలరించారు. అలాగే పాట‌లు యావ‌రేజ్ అయిన‌ప్ప‌టికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. నిజాయితీ క‌లిగిన అధికారి పాత్ర‌లో ర‌వితేజ అద్భుతంగా న‌టించారు. ఈ మూవీలోని మాస్ ఎలిమెంట్స్, ర‌వితేజ డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. శ‌ర‌త్‌కు ఇది ఫ‌స్ట్ మూవీ. అయినప్ప‌టికీ ర‌వితేజ‌ను కొత్త‌గా చూపించారు. ఇక కొన్ని డైలాగ్స్ అయితే ప్రేక్ష‌కులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

అయితే ర‌వితేజ లాంటి మాస్ హీరోను ద‌ర్శ‌కుడు ఇంకా బాగా వాడుకుని ఉంటే బాగుండ‌నిపిస్తుంది. అలాగే సాంకేతిక ప‌రంగా ఇంకాస్త మెరుగులు పెట్టి ఉండాల్సింద‌న్న భావ‌న క‌లుగుతుంది. ఇక సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా క‌థ కొత్త‌దే అయినా రొటీన్ క‌థ‌నంతో వీక్‌గా న‌డుస్తుంది. క్లైమాక్స్ అంత‌గా ఏమీ ఆక‌ట్టుకోదు. అయితే ర‌వితేజ పెర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్‌లు, యాక్ష‌న్ సీన్ల కోసం ఈ మూవీని ఒక్క‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now