Ram Gopal Varma : కేఏ పాల్‌ను దారుణంగా వాడుకున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌..!

April 4, 2022 1:24 PM

Ram Gopal Varma : సంచ‌న‌ల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా కూడా అందులో కొంత కాంట్ర‌వ‌ర్సీతో పాటు ఫ‌న్ ఉంటుంది. స‌మాజంలో ప్ర‌తి విష‌యంపై త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉండే వ‌ర్మ త‌న సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో దిట్ట‌. తాజాగా వర్మ డేంజెరస్ అనే మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వ‌ర్మ ప‌లు ప్రాంతాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. అంతేకా సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోలు పెడుతూ ఆస‌క్తిని క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. తాజాగా కేఏ పాల్ మాటల్ని వేరే వాయిస్ కి సింక్ చేసి అందరూ కచ్చితంగా డేంజరస్ సినిమాని మొదటి రోజే చూడాలని చెప్పించే ప్రయత్నం చేశారు.

Ram Gopal Varma used KA Paul for his movie promotion
Ram Gopal Varma

ఇటీవ‌ల కేఏ పాల్ త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంలో త‌న ఫాలోవ‌ర్ల‌తో లైవ్ సెష‌న్‌లో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. దీనిపై కేఏ పాల్ స్పందిస్తూ.. ప్ర‌తీ రోజు ఓ కొత్త సినిమా వ‌స్తుంది. అన్నింటినీ ఎవ‌రు గుర్తుంచుకుంటారు. ఆర్ఆర్ఆర్ గురించి ఎప్పుడూ విన‌లేదు. అంటూ స‌మాధాన‌మిచ్చాడు. అంతేకాదు మీకు వేరే ప‌నులేమి లేవా..? అని యువ‌త‌ను ప్ర‌శ్నించాడు. మీరు విడుద‌లైన ప్ర‌తీ సినిమాను చూస్తారా..? అని ప్ర‌శ్నించాడు. ప్ర‌తి ఒక్క‌రూ సమాజంలో మార్పు కోసం ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏదైనా ఉప‌యోగ‌ప‌డే ప‌ని చేయాలి.. నిర్మాణాత్మ‌కంగా ఉండాలి.. అని అన్నారు.

ఎవ‌రైనా సినిమా తీస్తే.. మీరు దాన్ని చూస్తారు. ఇది పూర్తిగా టైం వృథా. మీరు ఆ సినిమా నుంచి ఎలాంటి మంచి విష‌యాన్ని పొంద‌లేరు. క‌నీసం అర్థ‌వంత‌మైన సినిమాలు చూడండి. నేనెప్పుడూ ఆర్ఆర్ఆర్ గురించి విన‌లేదు. అస‌లు అదేంటో నాకు తెలియ‌దు.. అని పాల్ అన్నాడు. ఇదే వీడియోకి వ‌ర్మ వాయిస్ సింక్ చేయించి డేంజ‌ర‌స్ మూవీని చూడ‌మ‌ని చెప్పిన‌ట్టుగా వీడియో విడుద‌ల చేశారు. మీ చుట్టుపక్కల ఉన్నవారందరినీ ఈసారి తప్పనిసరిగా ఆర్జీవీ డేంజరస్ సినిమాను అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడాలి. ఎవరెవరు ఏవేవో సినిమాలు తీస్తే ఫస్ట్ డే వెళ్లి చూస్తారు. టైమ్ వేస్ట్ తప్ప దానివల్ల వచ్చే లాభమేంటి. ఏవైనా అర్థవంతమైన సినిమాలు ఉంటే చూడాలి. నా దృష్టిలో అర్థవంతమైన మూవీ డేంజరస్.. అంటూ కేఏ పాల్ వీడియోకి మిమిక్రీ వాయిస్‌ను జోడించారు. దీనిపై కేఏ పాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now