Ram Gopal Varma : టాలీవుడ్ హీరోల‌పై దుమ్మెత్తి పోసిన వ‌ర్మ‌.. దుమారం రేపుతున్న ట్వీట్లు..

September 12, 2022 12:42 PM

Ram Gopal Varma : వివాదాలు సృష్టించ‌డంలో ముందు వ‌ర‌స‌లో ఉండే వ్య‌క్తి ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ప్ర‌తి విష‌యంపై త‌నదైన రీతిలో స్పందిస్తూ ఉంటాడు. అవి కాస్తా కాంట్ర‌వ‌ర్సీల‌కు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా ఆయ‌న కృష్ణం రాజు మృతిపై స్పందిస్తూ చేసిన వాఖ్య‌లు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో దుమారం రేపుతున్నాయి. ఇక ఆయ‌న‌ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు హీరోల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

సీనియ‌ర్ న‌టుడు కృష్ణం రాజు మృతితో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. అయితే దీనిపై వ‌రుస ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌ల‌పై విరుచుకు ప‌డుతున్నాడు. ఆయ‌న‌ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా కృష్ణం రాజు మ‌ర‌ణంపై త‌న అభిప్రాయాల‌ను రాస్తూ.. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు.. సిగ్గు..! సిగ్గు..! అని తీవ్ర ప‌ద‌జాలంతో రాయ‌డం జ‌రిగింది.

Ram Gopal Varma sensation tweets he is angry on telugu actors
Ram Gopal Varma

అంత‌టితో ఆగ‌కుండా.. కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్ బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.. అంటూ సినీ పెద్ద‌ల‌ను ఘాటుగా విమ‌ర్శించాడు.

ఇంకా సినిమా షూటింగ్ లు ఆప‌క పోవ‌డంపై త‌న‌ అస‌హ‌నం తెలుపుతూ.. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.. అంటూ షూటింగ్ లు ఆప‌డానికి పిలుపునిచ్చారు. ఈ విష‌యంలో రామ్ గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కానీ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఆయ‌న‌ను ప‌ట్టించుకుంటుందో లేదో అని ప‌లువురు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now