Ram Gopal Varma : చదువుకునే రోజుల్లో నేను అలాంటి వాడినే.. వైరల్ గా మారిన వర్మ ట్వీట్..!

October 19, 2021 11:36 AM

Ram Gopal Varma : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. వివాదం ఎక్కడ ఉంటే ఆయన అక్కడే ఉంటారు. వివాదాలు లేకపోతే తనే ఒక వివాదాన్ని సృష్టించి సంచలనం చేస్తారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏ చిన్న మాట మాట్లాడినా చిన్న పోస్ట్ చేసినా అవి పెద్ద ఎత్తున వైరల్ గా మారుతాయి.

Ram Gopal Varma posted about his childhood

తాజాగా ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్వర్మ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇందులో రామ్ గోపాల్ వర్మ చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవాడో అద్భుతంగా చూపించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఫిలిమ్ మేకర్ అయిన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చారు. తనకు చదువు అంటే ఏ మాత్రం ఇష్టం లేదని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఒక ఫోటోను షేర్ చేస్తూ.. చదువుకునే రోజుల్లో నేను కూడా ఇలాంటి విద్యార్థినే.. అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది.. అనే విషయానికి వస్తే.. వెనక ఒక అబ్బాయి ముందు కూర్చున్న అబ్బాయిని జవాబులు అడుగుతూ పరీక్ష రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ముందు అబ్బాయి పుల్‌ స్టాఫ్ అని చెప్పగానే. వెనకున్న అబ్బాయి పుల్‌ స్టాఫ్ స్పెల్లింగ్ చెప్పమని అడుగుతారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటే ఇలా ఉంటారా.. అనే విధంగా ఈ ఫోటో ఉండటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now