Ram Gopal Varma : వ‌ర్మ‌.. ఏంటీ ఖర్మ‌..? ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఊహించ‌నే లేదు..!

April 7, 2022 6:17 PM

Ram Gopal Varma : ఒక‌ప్పుడు శివ లాంటి చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు చిన్నాచిత‌కా సినిమాలు చేస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఆయ‌న సినిమాలు ఎక్కువ‌గా వివాదాలు సృష్టిస్తుంటాయి. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా వాటిని సాల్వ్ చేసి విడుద‌ల చేస్తూ ఉంటాడు. తాజాగా ఆయ‌న నైనా గంగూలీ, అప్సర రాణి ముఖ్యపాత్రల్లో డేంజ‌ర‌స్‌ అనే మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాని ఈ నెల 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాకి సంబంధించి కొద్ది రోజులుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుపుతుండ‌గా, ఆయ‌న‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చాయి థియేట‌ర్ యాజ‌మాన్యాలు.

Ram Gopal Varma did not think about that this poor situation would come
Ram Gopal Varma

థియేటర్స్, మల్టీప్లెక్స్ ల‌కు సంబంధించిన యాజమాన్యాలు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ వంటి వివాదాస్పద చిత్రాన్నిథియేటర్స్‌లో ప్రదర్శించబోమంటూ తెగేసి చెప్పాారు. మొత్తంగా ఒకప్పడు తన సినిమాలతో దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడికి ఇంత కంటే అవమానం మరొకటి ఉండంటున్నారు ప్రేక్షకులు. ఇక‌ థియేటర్స్ యాజమాన్యాలు తన సినిమాను తిరస్కరిస్తే .. ఓటీటీ లేదా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసినా చేసే రకం రామ్ గోపాల్ వర్మ.. త‌న సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్ర‌క‌టించాడు.

ఇప్పటికే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌వ‌గా, ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. థియేటర్లు సహకరించకపోవడంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ఆర్జీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. సినిమా విడుదలపై కోర్ట్ స్టే ఇవ్వడంతో.. రిలీజ్ పై వెనకడుగు వేశారు వర్మ. ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర క‌థ మూలాన చాలా థియేట‌ర్స్ నాన్ కో-ఆప‌రేష‌న్ దృష్ట్యా ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయంని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న‌ తరువాత మరో విడుదల తేదీ తెలియజేస్తాను.. మీ రామ్ గోపాల్ వర్మ.. అంటూ ట్వీట్ చేశారు వర్మ. న‌ట్టి కుమార్ వేసిన పిటిష‌న్ వ‌ల‌న కూడా వ‌ర్మ వెన‌క్కు త‌గ్గాల్సి వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎప్పుడు విడుద‌ల‌కు నోచుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now