Ram Charan Upasana : పిల్ల‌ల్ని ఎప్పుడు కంటారు ? అన్న ప్ర‌శ్న‌కు ఉపాస‌న స‌మాధానం ఇదే..!

November 12, 2021 10:30 AM

Ram Charan Upasana : టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ తేజ్‌.. వీరంద‌రూ ఒకే త‌రం హీరోలు. వీరంద‌రికీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. అయితే అంద‌రూ పిల్ల‌ల్ని క‌ని వాళ్ల‌ను పెంచుతూ వాళ్ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. కానీ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, ఉపాస‌న జంట‌కు మాత్రం ఇంకా సంతానం క‌ల‌గ‌లేదు. దీనిపై ప‌లు సంద‌ర్భాల్లో ఆమెను ప్ర‌శ్న‌లు అడుగుతూనే ఉన్నారు.

Ram Charan Upasana  told about children

ఇక రామ్ చ‌ర‌ణ్‌ను కూడా పిల్ల‌ల్ని ఎప్పుడు కంటారు ? అని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆ ప్ర‌శ్న‌కు ఆ జంట స‌మాధానం మాత్రం చెప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న తాజాగా ఓ మీడియా సంస్థ‌ఖు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు.

పిల్ల‌ల్ని ఎప్పుడు కంటారు ? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఉపాస‌న బ‌దులిస్తూ.. అది త‌మ స్వ విష‌య‌మ‌ని, ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఎప్పుడు చెప్పాలో త‌మ‌కు తెలుస‌ని, స‌మయం వ‌చ్చిన‌ప్పుడు అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెబుతాన‌ని.. ఉపాస‌న చెప్పారు. ఇక రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విడుద‌లకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు శంక‌ర్ డైరెక్ష‌న్‌లో చ‌ర‌ణ్ ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే ఆచార్య మూవీలోనూ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now