Samantha : స‌మంత గురించి మూడు ముక్క‌ల్లో చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌..!

December 28, 2021 4:38 PM

Samantha : రామ్ చ‌రణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున అభిమానులు హాజ‌రై సంద‌డి చేశారు. అయితే చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు మీడియా నుండి ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుండ‌గా వాటికి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇస్తున్నారు.

ram charan tej told about Samantha

తాజాగా రామ్ చ‌రణ్‌కి స‌మంత గురించి చెప్ప‌మ‌ని ఓ ప్ర‌శ్న ఎదురు కాగా, దానికి ‘కమ్ బ్యాక్‌.. బిగ్గర్‌.. స్ట్రాంగర్‌..’ అంటూ మూడు ముక్కల్లో చెప్పాడు రామ్‌ చరణ్‌. అయితే ఈ మాటలు విన్న సామ్‌ తెగ సంతోషపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మూడు లవ్‌ సింబల్స్‌తో ట్విట్టర్‌లో షేర్‌ చేసింది సామ్ . ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

విడాకుల త‌ర్వాత స‌మంత హాట్ టాపిక్‌గా మారుతోంది. చైతూతో ఎంతో అన్యోన్యంగా ఉండే సామ్ విడాకులు ఎందుకు తీసుకుందని ఇంకా చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. వీరి మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్‌ 2న తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్‌ చేస్తూ కొందరు విపరీతంగా ట్రోల్‌ చేశారు. అవేమీ ప‌ట్టించుకోకుండా సామ్ ముందుకు సాగుతోంది.

https://twitter.com/Samanthaprabhu2/status/1475394842280673282?s=20

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment