Ram Charan Tej : ఇండియాలోనే తొలిసారి.. 80 మంది ఫారిన్ డ్యాన్స‌ర్లతో చ‌ర‌ణ్ చిందులు..

November 26, 2021 9:55 AM

Ram Charan Tej : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో విశేషం బయటకు వచ్చి ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్‌లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఆఫ్రికా, యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు పాల్గొననున్నారట‌. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.

Ram Charan Tej to dance with 80 foreign dancers in shankar movie

తమన్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం రూ.40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పది రోజుల పాటు ఆ అదిరిపోయే లొకేషన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్సర్లు ఇప్పటికే బస చేస్తున్నారు. ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఫారిన్ డ్యాన్సర్ లను ఇండియాలో వాడలేదని అంటున్నారు.

రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న‌ ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్‌లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ.200 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం అయితే వెలువడాల్సి ఉంది. ఇందులో చ‌ర‌ణ్ డిఫ‌రెంట్ లుక్‌లో కనిపించి సంద‌డి చేయ‌నున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now