Ram Charan NTR : మొన్న చ‌ర‌ణ్.. ఇప్పుడు ఎన్‌టీఆర్‌.. వ‌రుస‌గా మాల ధ‌రించ‌డం వెనుక కార‌ణం ఇదేనా ?

April 16, 2022 11:24 PM

Ram Charan NTR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్‌.. బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేస్తోంది. బాహుబ‌లికి మించి క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తూ మ‌రోసారి తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. ఈ క్ర‌మంలోనే త్వర‌లో మేక‌ర్స్ ఈ మూవీని చైనా, జ‌పాన్‌ల‌లోనూ విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుద‌ల అనంత‌రం కొంత గ్యాప్ ఇచ్చిన హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌లు.. వ‌రుస‌గా మాల‌ధార‌ణ చేశారు. ముందుగా చ‌ర‌ణ్ అయ్య‌ప్ప మాల ధ‌రించ‌గా.. ఇప్పుడు ఎన్‌టీఆర్ హ‌నుమాన్ దీక్ష చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే మ‌రో 21 రోజుల పాటు ఆయ‌న నిష్ట‌గా ఉండి త‌రువాత మాల తీసేస్తారు.

Ram Charan NTR took deeksha this may be the reason
Ram Charan NTR

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా త‌రువాత ఈ ఇద్ద‌రు హీరోలు వ‌రుస‌గా మాల‌ల‌ను ధ‌రించ‌డం ఆలోచింప‌జేస్తోంది. వీరు మాల‌ను ఇప్పుడే ఎందుకు ధరించారు.. అది కూడా ఒక‌రి త‌రువాత ఒక‌రు ఏదో కూడ‌బ‌లుక్కున్న‌ట్లు మాల‌ను ధ‌రించారు.. కార‌ణం ఏమై ఉంటుందబ్బా.. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే అందుకు కార‌ణాల‌ను కూడా వారే అన్వేషిస్తున్నారు. కొన్నింటిని వారు కార‌ణాలుగా చూపుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయితే మాల ధ‌రిస్తామ‌ని చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌లు ఇద్ద‌రూ త‌మ ఇష్ట‌దైవాల‌కు మొక్కుకుని ఉండ‌వ‌చ్చు. అది ప్రధాన కార‌ణంగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని తీసేందుకు చాలా కాలం ప‌ట్టింది. క‌నుక వీరికి మాల ధ‌రించే అవ‌కాశం రాలేద‌ని.. ఇప్పుడు సినిమా విడుద‌లై అంతా స‌ద్దు మ‌ణిగింది క‌నుక ఇక మాల‌ను ధ‌రించ‌వ‌చ్చ‌ని అనుకున్నారేమో. క‌నుక‌నే ఇద్ద‌రూ ఒక‌రి త‌రువాత ఒకరు మాల‌ల‌ను ధ‌రించార‌ని తెలుస్తోంది. అయితే దీక్ష‌ల అనంత‌రం త్వ‌ర‌లోనే వీరు త‌మ త‌మ సినిమాల‌తో బిజీ కానున్నారు.

చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన విడుద‌ల కానుండ‌గా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ మూవీ ప్ర‌మోషన్ కార్య‌క్ర‌మాల‌ను నిర్మాత అయిన చ‌ర‌ణ్ స్వ‌యంగా దగ్గ‌రుండి చూసుకుంటున్నారు. అలాగే దీక్ష త‌రువాత ఆయ‌న శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న మూవీ త‌దుప‌రి షెడ్యూల్‌లో పాల్గొన‌నున్నారు. ఇక ఎన్‌టీఆర్ ఈ దీక్ష అయ్యాక కొరాట‌ల శివతో సినిమా చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now