Ram Charan : తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న రామ్ చ‌రణ్‌.. ఏం చేశారో తెలుసా..?

June 8, 2022 10:44 AM

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్‌లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటూనే ఉన్నారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారికి కాదు.. లేదు.. అన‌కుండా ఆయ‌న స‌హాయం చేస్తూనే ఉంటారు. ఇప్ప‌టికే చిరంజీవి బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్ ల‌తో ఎంతో మందికి జీవ‌న దానం చేశారు. తాను చేసే సినిమాలు ఫ్లాప్ అయితే న‌ష్టం మొత్తాన్ని ఆయ‌నే భ‌రిస్తుంటారు. ఇటీవ‌ల ఆచార్య మూవీ విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. అయితే కేవ‌లం మెగాస్టార్ మాత్ర‌మే కాదు.. ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కూడా తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నారు. ఆయ‌న కూడా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామి అవుతున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ తాజాగా త‌న డ్రైవ‌ర్ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రిపించి ఆశ్చ‌ర్య ప‌రిచారు.

రామ్ చ‌ర‌ణ్ త‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్ న‌రేష్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా అత‌నికి తెలియ‌కుండా అత‌ని బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ప్లాన్ చేశారు. కేక్ క‌ట్ చేసి న‌రేష్ కు చ‌ర‌ణ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో న‌రేష్ ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యాడు. కాగా ఈ వేడుక‌ల్లో ఉపాస‌న కూడా పాల్గొన్నారు. అలా త‌న డ్రైవ‌ర్ బ‌ర్త్‌డేను అత‌నికి తెలియ‌కుండా స‌డెన్‌గా జ‌రిపించి చ‌ర‌ణ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. ఇలా చ‌ర‌ణ్ చేయ‌డం కొత్తేమీ కాదు. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసేవారిని ఆయ‌న ఇలాగే చూసుకుంటారు. చిరంజీవి కూడా ఇలాగే చేస్తారు. దీంతో చ‌ర‌ణ్ కూడా ఆయ‌న అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తుండ‌డంపై ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Ram Charan celebrated his driver Naresh birth day fans happy
Ram Charan

ఇక రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రెండు సినిమాల్లో ఒక‌టి భారీ హిట్ అవ‌గా.. ఇంకొక‌టి ఫ్లాప్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయితే.. ఆచార్య డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. ఇక ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి విశ్వంభ‌ర అనే టైటిల్‌ను ముందుగా అనుకున్నారు. కానీ పాత టైటిల్‌లా ఉంటుంద‌ని చెప్పి.. స‌ర్కారోడు అనే టైటిల్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనంత‌రం జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో క‌లిసి చ‌ర‌ణ్ ఓ మూవీ చేయ‌నున్నారు. ఇలా చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment