Ram Charan : నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన రామ్ చ‌ర‌ణ్‌, కీర్తి సురేష్‌..!

January 27, 2022 7:54 AM

Ram Charan : కీర్తి సురేష్ న‌టించిన తాజా చిత్రం గుడ్ ల‌క్ స‌ఖి. షూటింగ్ క‌థాంశం నేప‌థ్యంలో కొన‌సాగ‌నున్న ఈ మూవీలో జ‌గ‌ప‌తి బాబు కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇటీవ‌లే ఈ మూవీకి చెందిన ట్రైల‌ర్ విడుద‌ల కాగా దానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 28వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

Ram Charan and Keerthy Suresh danced for natu natu song in rrr movie

కాగా గుడ్ ల‌క్ స‌ఖి చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజ‌రు కావ‌ల్సి ఉంది. కానీ ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఈ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ చిత్ర యూనిట్‌కు విషెస్ చెప్పారు. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. మ‌హాన‌టి ఉండ‌గా.. చిత్రం ఎలా ఫ్లాప్ అవుతుంది, విజ‌యం సాధించి తీరుతుంద‌ని చ‌ర‌ణ్ అన్నారు.

ఇక న‌గేష్ కుకునూర్ సినిమాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. గ‌త చిత్రాలు హైద‌రాబాద్ బ్లూస్‌, ఇక్బాల్‌ల‌పై చ‌ర‌ణ్ ప్రశంస‌లు కురిపించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మ‌రోమారు గుడ్ ల‌క్ స‌ఖి చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

కాగా ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆర్ఆర్ఆర్‌లో పాపుల‌ర్ అయిన నాటు నాటు సాంగ్‌కు రామ్ చ‌ర‌ణ్‌, కీర్తి సురేష్‌లు స్టెప్పులేసి అంద‌రినీ అల‌రించారు. మ‌హాన‌టి సినిమా త‌రువాత కీర్తి సురేష్ చేసిన సినిమా కావ‌డంతో చిత్రంపై అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now