Rakul Preet Singh : త‌న తండ్రి నిర్ణ‌యాన్ని లెక్క చేయ‌కుండా సినిమాల‌లోకి వచ్చిన ర‌కుల్‌..!

October 10, 2021 8:06 PM

Rakul Preet Singh : టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే స్పెషల్ లో ఆమె గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విశేషాల్ని తెలుసుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్ అనే పేరు ఆమె పేరెంట్స్ మొదటి అక్షరాల నుండి పెట్టారట. రకుల్ తండ్రి రాజేందర్ సింగ్, తల్లి కుల్విందర్ సింగ్. అలా వీరిద్దరి పేర్ల నుండి రకుల్ ప్రీత్ సింగ్ అనే పేరును ఫిక్స్ చేశారు. మీకో విషయం తెలుసా.. రకుల్ నేషనల్ స్థాయి గోల్ఫర్. ఆమెను గోల్ఫ్ లో సపోర్ట్ చేసింది ఆమె తండ్రి. అయితే రకుల్ కి గోల్ఫ్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో యాక్టింగ్, మోడలింగ్ ఫీల్డ్ లోకి వచ్చేశారు. రకుల్ కి ఫిట్ నెస్ అంటే మహా ఇష్టం.

Rakul Preet Singh came into film industry by disobeying her fathers wish

తనకు తెలిసినవారిని, తన అభిమానుల్ని సైతం వర్కవుట్స్ చేయమని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు హైదరాబాద్ లో 2 ఫంక్షనల్ ట్రైనింగ్ జిమ్ లను, వైజాగ్ లో ఒకటి స్టార్ట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ కి గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. తనకు ఏమాత్రం బ్రేక్ దొరికినా గుర్రపు స్వారీ చేస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రకుల్ భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. డాన్స్ ని ఫిట్ నెస్ కి వ్యాయామంగా ట్రీట్ చేస్తుంది. అలాగే చిన్నతనం నుండి కరాటేలో ట్రైనింగ్ తీసుకుంది. రకుల్ కి బ్లూ బెల్ట్ కూడా ఉంది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద అభిమాని. ఎన్నో సంస్థలకు మోడలింగ్ చేసింది. అలాగే పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్, ఫెమినా మిస్ బ్యూటిఫుల్ ఐస్ లాంటి గ్లామర్ కాంపిటేషన్ లో విన్ అయ్యింది. మొట్ట మొదట తన కెరీర్ ని కాస్మటిక్ ప్రొడక్ట్ తో స్టార్ట్ చేసింది. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా అలరించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now