Raksha : న‌టితో మిస్ బిహేవ్ చేసిన పెద్ద మ‌నిషి.. చెంప చెళ్లుమ‌నిపించింది..

October 11, 2021 3:22 PM

Raksha : సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులున్నారు. కొన్నిసార్లు మేకప్ ఆర్టిస్టుల దగ్గర నుండి ప్రోడ్యూసర్ ల వరకు సినీ నటుల్ని అవమానిస్తూ ఉంటారు. కొంతమంది సందర్భాన్ని బట్టి సరైన సమాధానం ఇస్తుంటారు. కానీ మరికొంతమంది మాత్రం పక్కకు వెళ్ళిపోతుంటారు. అయితే ఓ డైరెక్టర్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పిచ్చి తిట్లు తిట్టారట. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి నటిగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన రాణి అలియాస్ రక్ష.

Raksha told that she slapped a man who misbehaved with her

నచ్చావులే సినిమాలో హీరోకి తల్లిగా నటించింది. ప్రేమలేఖ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈమె తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. పంచదార చిలక, అడవి చుక్క, పవిత్ర ప్రేమ లాంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి హీరోగా యాక్ట్ చేసిన బంపర్ ఆఫర్ సినిమాలో హీరోయిన్ కు తల్లిగా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం తనకు జరిగిన సంఘటనకి ఓ వ్య‌క్తి  చెంప పగలకొట్టింది.

బి. గోపాల్ డైరెక్షన్ లో భాగంగా సినిమా షూటింగ్ కోసం రక్ష చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తుంటే పక్కన ఉన్న ఓ పెద్ద వ్యక్తి తనతో మిస్ బిహేవ్ చేశారని అన్నారు. ఇక సహించలేని రక్ష ఈ వయస్సులో ఇదేం పనిరా అంటూ అక్కడే ఉన్నపళంగా చెంప చెళ్ళుమనేలా కొట్టానని అన్నారు. తమిళ దర్శకుడు తనకు కథ చెప్పేటప్పుడు పెళ్ళి అయ్యిందని అందుకే గ్లామర్ రోల్స్ చేయనని కచ్చితంగా చెప్పానని రక్ష అన్నారు. సినీ ఇండస్ట్రీలో అందరూ ఒకలా ఉండరనేది కామన్ అభిప్రాయం. నిజానికి ఆడవాళ్ళను ఏడిపించేవాళ్ళు ఏ రంగంలోనైనా ఉంటారని అన్నారు. అయితే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామనేది ముఖ్యం అని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment