Mahesh Babu : మ‌హేష్ బాబుతో సినిమా.. ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ కోసం వెదుకుతున్న రాజ‌మౌళి..?

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం మ‌హేష్, త్రివిక్ర‌మ్‌ల మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ మూవీ ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు కంప్లీట్ అయితే త‌రువాత వ‌చ్చే ఏడాది నుంచి మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మ‌హేష్ – రాజ‌మౌళి మూవీకి ఇప్ప‌టికే రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఈ మ‌ధ్య ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. మ‌హేష్ మూవీ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ల‌లో ఉంటుంద‌ని.. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో సినిమా క‌థ సాగుతుంద‌ని హింట్ ఇచ్చారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచ‌నాలు పెరిగాయి. ఇక ఫ్యాన్స్ అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా.. ఎప్పుడు ఫ‌స్ట్ అప్‌డేట్ వ‌స్తుందా.. అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించ‌నున్న మూవీ కోసం రాజ‌మౌళి ఒక ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌ను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. రాజ‌మౌళి సినిమా అంటేనే విల‌న్ పాత్ర భ‌యంక‌రంగా, దారుణంగా ఉంటుంది. క‌నుక‌నే సినిమాలు హిట్ అవుతుంటాయి. కాబ‌ట్టి ఒక స్ట్రాంగ్ విల‌న్ కోసం ఆయ‌న వెదుకుతున్నార‌ట‌. అందులో భాగంగానే ప‌లువురు త‌మిళ స్టార్ హీరోల పేర్ల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విక్ర‌మ్‌, సూర్య లేదా ఆయ‌న త‌మ్ముడు కార్తిల‌ను రాజ‌మౌళి సంప్ర‌దిస్తున్నార‌ట‌. వీరిలో ఎవ‌రు విల‌న్‌గా న‌టిస్తారు.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Mahesh Babu

సూర్య ప్ర‌స్తుతం హీరో క్యారెక్ట‌ర్లే చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. క‌నుక సూర్య విల‌న్‌గా చేయ‌క‌పోవ‌చ్చు. ఇక కార్తి, విక్ర‌మ్ అంటే.. వీరికి హిట్ ప‌డి చాలా రోజులు అవుతోంది. వీరు హీరోలు అన్న విష‌యాన్నే చాలా మంది మ‌రిచిపోయారు. క‌నుక వీరు విల‌న్ పాత్రలో న‌టించేందుకు అంగీకారం తెల‌ప‌వ‌చ్చ‌ని స‌మాచారం. అయితే వీరేనా.. లేక ఇంకెవ‌రినైనా రాజ‌మౌళి సంప్ర‌దిస్తున్నారా.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది. అయితే త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి వివ‌రాల‌ను వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM