Rajamouli : బాబోయ్‌.. దెయ్యాలు అంటే భ‌యం.. అంటున్న రాజ‌మౌళి..!

June 20, 2022 9:24 PM

Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న వెకేష‌న్‌కు వెళ్లి వ‌చ్చారు. అయితే వెకేష‌న్ సంద‌ర్భంగా ఆయ‌న సూపర్ స్టార్ మ‌హేష్ బాబును క‌లిసి ఆయ‌న‌తో తీయ‌బోయే సినిమా క‌థ‌ను ఓకే చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. అయితే వెకేష‌న్ నుంచి వ‌చ్చిన త‌రువాత రాజ‌మౌళి ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నారు. అందులో భాగంగానే ఆయ‌న ఆహా సంస్థ నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన్నారు.

ఆహా సంస్థ నిర్మిస్తున్న ఆన్యాస్ ట్యుటోరియ‌ల్ అనే సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను రాజ‌మౌళి లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న‌కు దెయ్యాలు అంటే భ‌య‌మ‌ని.. అందుక‌నే హార్ర‌ర్ సినిమాల‌ను చూడ‌న‌ని ఆయ‌న తెలిపారు. అయితే త‌న‌కు రెండు హార్ర‌ర్ సినిమాలు అంటే ఇష్ట‌మ‌ని తెలిపారు. హాలీవుడ్‌లో వ‌చ్చిన ది ఓమెన్‌, ది పారానార్మ‌ల్ యాక్టివిటీ అనే రెండు చిత్రాలు అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాల‌ను చూసేందుకు ఆయ‌న ఫ్యాన్స్ ఆన్‌లైన్ లో ఈ మూవీల కోసం వెదుకుతున్నారు.

Rajamouli says he will not see horror movies
Rajamouli

ఇక రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 2023 ప్ర‌థ‌మార్థంలో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు గాను రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక ఆన్యాస్ ట్యుటోరియ‌ల్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఈ మూవీని ఆహా సంస్థ నిర్మిస్తుండ‌గా.. ప‌ల్ల‌వి గంగిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. రెజీనా, నివేదిత స‌తీష్ లు ఇందులో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శోభు యార్ల‌గడ్డ‌, ప్రసాద్ దేవినేనిలు ఈ మూవీని స‌మ‌ర్పిస్తున్నారు. ఆహాలో ఈ మూవీ జూలై 1వ తేదీన రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now