Rajamouli : ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్‌ను ఆదివారం అయోధ్యలో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్ కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని నిరుత్సాహ పరచింది. అభిమానుల్లో కొందరు రోమాలు నిక్కబోడుచుకున్నాయని అంటుంటే.. మరి కొందరు కార్టూన్లతో సినిమా చేశారేంటి ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ నెటిజన్లు, అభిమానులే ఈ టీజర్ మీద కామెంట్ చేశారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఆదిపురుష్ టీజర్‌ను కామెంట్ చేసే జాబితాలో చేరారు.
ప్రభాస్ లాంటి తోపు హీరోతో ఇలాంటి సినిమా తీయడం ఏంటి అంటున్నారు. అదే నేనైతే ప్రభాస్ ని రాముడి పాత్రలో అద్భుతంగా చూపించేవాడిని అంటూ రాజమౌళి కామెంట్స్ చేశారు. అసలు ప్రభాస్ లాంటి తోపు హీరోని పెట్టుకుని కూడా ఇలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో చూపించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రజంట్ ఈ కామెంట్స్ పరోక్షంగా ఓం రౌత్ పై ఎఫెక్ట్ చూపించనున్నాయట. టీజర్ విడుదలైన 2 గంటల తర్వాత రాజమౌళి సోదరుడు నటుడు, రచయిత ఎస్.ఎస్.కాంచీ ఈ విషయం మీద ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి అంటూ కామెంట్ చేశారు. అయితే కాంచీ ఎక్కడా పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడాయన ట్వీట్ పై పలువురు భిన్నంగా స్పందించారు. అయితే కొంతమంది నెటిజన్లు ప్రభాస్ ను రాముడిగా చూపించాలంటే అది రాజమౌళికే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ ను వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ చేయనున్నారు. మరి టీజర్ విషయంలోనే ఈ రేంజ్ లో కామెంట్స్ వస్తే.. నెక్ట్స్ ట్రైలర్ రిలీజ్ అయితే కామెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…