Rajamouli : ఎన్‌టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌ని రాజ‌మౌళి.. కార‌ణం ఏమిటి ?

May 21, 2022 8:07 PM

Rajamouli : ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అంద‌రికీ తెలిసిందే. వీరు ఒక‌రితో ఒక‌రు ఎంతో చ‌నువుగా ఉంటారు. వీరి ఫ్యామిలీలు కూడా అంతే. రాజ‌మౌళిని అయితే ఎన్‌టీఆర్ జ‌క్క‌న్న అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే మే 20న ఎన్‌టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా చాలా మంది ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. కానీ రాజ‌మౌళి చెప్ప‌లేదు. దీంతో అస‌లు వీరి మ‌ధ్య ఏమైంది ? ఎందుకు రాజ‌మౌళి ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌లేదు ? అని చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ ఇటీవ‌లే 50 రోజుల వేడుక‌ను పూర్తి చేసుకుని ఓటీటీలోనూ రిలీజ్ అయింది. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌కు ప్రాధాన్య‌త లేకుండా చేశార‌ని.. పూర్తిగా చ‌ర‌ణ్‌నే ఎలివేట్ చేశార‌ని.. రాజ‌మౌళిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. అలాగే ఎన్టీఆర్‌ను ఎలివేట్ చేసే సీన్ల‌ను కొన్నింటిని చివ‌రి నిమిషంలో తొల‌గించారు. ఇది కూడా ఫ్యాన్స్ అసంతృప్తికి కార‌ణ‌మైంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ నేప‌థ్యంలో రాజ‌మౌళి, ఎన్టీఆర్ కు మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. క‌నుక‌నే వారు అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉంటున్నార‌ని అంటున్నారు.

Rajamouli not told birthday wishes to NTR what is the reason
Rajamouli

రాజ‌మౌళి, ఎన్‌టీఆర్ పెద్ద‌గా మాట్లాడుకోవ‌డం లేద‌ని.. ఆర్ఆర్ఆర్ త‌రువాత వారి మ‌ధ్య కాస్త దూరం పెరిగింద‌ని అంటున్నారు. క‌నుక‌నే ఎన్‌టీఆర్ బ‌ర్త్ డే రోజున ఆయ‌న‌కు రాజ‌మౌళి విషెస్ చెప్ప‌లేద‌ని అంటున్నారు. అయితే ఇవ‌న్నీ పుకార్లేన‌ని.. వాస్త‌వానికి ఆ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అని.. సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌మౌళి బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌క‌పోయినా.. ఫోన్ చేసి లేదా ప‌ర్స‌న‌ల్‌గా క‌లిసి విషెస్ చెప్పి ఉంటార‌ని.. క‌నుక దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన ప‌నిలేద‌ని.. వారి ఫ్రెండ్‌షిప్‌ను అనుమానించక్క‌ర్లేద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now