Rahul Ramakrishna : ఏంద‌య్యా రాహుల్ ఇదేం పని.. ఇక నిన్ను ప్రేక్ష‌కులు న‌మ్ముతారా ?

February 6, 2022 8:02 AM

Rahul Ramakrishna : మీకు ఒక పాత పులి క‌థ గుర్తుందా.. అందులో ఒక కుర్రాడు పొలం ప‌నులు చేసుకుంటున్న త‌న తండ్రి, ఇత‌రుల‌ను ఆట ప‌ట్టించ‌డం కోసం అదిగో పులి.. అని రెండు సార్లు అరుస్తాడు. వారు నిజంగానే పులి వ‌చ్చిందేమోన‌ని రెండు సార్లు అత‌ని వ‌ద్ద‌కు ప‌రుగెత్తుతారు. ఇక ఇదేదో బాగుంద‌ని అనుకున్న అత‌ని వ‌ద్ద‌కు మూడోసారి నిజంగానే పులి వ‌స్తుంది. అయితే ఈ సారి అత‌ను పులి వ‌చ్చింద‌ని నిజంగానే అరుస్తాడు. కానీ అత‌న్ని ఎవ‌రూ న‌మ్మ‌రు. చివ‌ర‌కు అత‌న్ని పులి నోట క‌రుచుకు పోతుంది. అవును.. క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌ను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తోంది.

Rahul Ramakrishna says he joked about his industry retirement netizen angry
Rahul Ramakrishna

ఎవ‌రితో జోక్స్ అయినా చేయ‌వ‌చ్చు. కానీ ప్రేక్ష‌కుల‌ను ఆట ప‌ట్టించ‌కూడ‌దు. అది రివ‌ర్స్ అవుతుంది. క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ గ‌తంలో ఒక‌సారి తాను ట్విట్ట‌ర్ నుంచి దూర‌మ‌వుతున్నాన‌ని.. ఇక ట్విట్ట‌ర్‌ను వాడ‌బోన‌ని చెప్పాడు. త‌రువాత కొన్ని రోజుల‌కే ట్విట్ట‌ర్‌కు వ‌చ్చాడు. ఇక ఇటీవ‌ల తాను సినిమాల్లో న‌టించ‌బోన‌ని, 2022 త‌న‌కు ఆఖ‌ర‌ని, ఈ ఏడాది త‌రువాత సినిమాల్లో న‌టించేది లేద‌ని.. చెప్పాడు.

అయితే అత‌ను చెప్పింది అంతా నిజ‌మే అని ప్రేక్ష‌కులు న‌మ్మారు. అత‌ను ఇంత స‌డెన్ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడా.. అని తీవ్రంగా ఆలోచించారు. అలాంటి నిర్ణ‌యం తీసుకోకు.. అని హిత‌వు ప‌లికారు. అయితే తీరా చూస్తే అదంతా వ‌ట్టిదే అని.. అత‌ను జోక్ చేశాడ‌ని అర్థ‌మైంది. ఆ విష‌యాన్ని అత‌నే మ‌ళ్లీ వెల్ల‌డించాడు. దీంతో రాహుల్ తీరుపై ప్రేక్ష‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇలాంటి విష‌యాల‌పై జోక్ చేయ‌డం ఏంటి ? రాహుల్ ఇదేం ప‌ని, ఇలా చేయ‌వ‌చ్చునా.. ఇక‌పై నువ్వు ఏదైనా చెబితే ప్రేక్ష‌కులు న‌మ్ముతారా..? ఒక వేళ నీకు నిజంగానే ఏదైనా అవ‌స‌రం ప‌డి నువ్వు ట్వీట్ చేస్తే అప్పుడు అది నిజ‌మే అని ఎవ‌రైనా న‌మ్ముతారా ? ఇలాంటి సెన్సిటివ్ విష‌యాల‌పై ఎల్ల‌ప్పుడూ జోక్స్ వేయ‌కు.. అని నెటిజ‌న్లు అత‌న్ని విమ‌ర్శిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now