Radhika Apte : రాధిక ఆప్టే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా.. నటిగా తనదైన ముద్రను వేసుకుంది. ప్రస్తుతం ఆమె సౌత్ చిత్రాలేవీ చేయడం లేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. కాకపోతే.. సినిమాల కంటే.. ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, ఇంటర్వ్యూలలో ఆమె చెప్పే విషయాలు కాంట్రవర్సీ అవుతూ.. ఆమెను వార్తలలో ఉండేలా చేస్తుంటాయి. ఇక రక్తచరిత్ర మూవీతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే.. ఆ తర్వాత ధోని, లెజెండ్, కబాలి, లయన్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో ఆమె చేయలేదు.
అయితే తాజాగా ఆమె పెళ్లి వ్యవస్థపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి రాధికా ఆప్టే కూడా పెళ్లి చేసుకుందన్న సంగతి చాలామందికి తెలీదు. ఆ విషయంపై కూడా ఈమె స్పందించింది. నాకు పెళ్లి వ్యవస్థపై అస్సలు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే అనుమానం అందరికీ రావడం సహజం. నేను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 8 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే వివాహం చేసుకుంది.
అయితే 2016లో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన ఒక బోల్డ్ షార్ట్ ఫిలిం మేకింగ్ వీడియోలు ఎవరో తన తల్లికి పంపారని, ఆమెతో పాటు అప్పట్లో ఆ వీడియో అందరి మొబైల్స్ లో చక్కర్లు కొట్టింది అని, ఆఖరికి తన డ్రైవర్ కూడా ఆ వీడియో చూశాడని, తనకు ఆ సమయంలో ఏమి చేయాలో అర్ధం కాలేదని, చివరికు 4 రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక చెప్పింది. అయితే తరువాత ఆ సంఘటనే తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పింది రాధికా. అప్పటి తన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది ఈ అమ్మడు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…