Radhika Apte : ఆ వీడియోల‌ వల్ల 4 రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదు.. రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్..

September 14, 2022 3:08 PM

Radhika Apte : రాధిక ఆప్టే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా.. నటిగా తనదైన ముద్రను వేసుకుంది. ప్రస్తుతం ఆమె సౌత్ చిత్రాలేవీ చేయడం లేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. కాకపోతే.. సినిమాల కంటే.. ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, ఇంటర్వ్యూలలో ఆమె చెప్పే విషయాలు కాంట్రవర్సీ అవుతూ.. ఆమెను వార్తలలో ఉండేలా చేస్తుంటాయి. ఇక రక్తచరిత్ర మూవీతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే.. ఆ తర్వాత ధోని, లెజెండ్, కబాలి, లయన్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో ఆమె చేయలేదు.

అయితే తాజాగా ఆమె పెళ్లి వ్యవస్థపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి రాధికా ఆప్టే కూడా పెళ్లి చేసుకుందన్న సంగతి చాలామందికి తెలీదు. ఆ విషయంపై కూడా ఈమె స్పందించింది. నాకు పెళ్లి వ్యవస్థపై అస్సలు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే అనుమానం అందరికీ రావడం సహజం. నేను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 8 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే వివాహం చేసుకుంది.

Radhika Apte told about her past in cinema career
Radhika Apte

అయితే 2016లో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన ఒక బోల్డ్ షార్ట్ ఫిలిం మేకింగ్ వీడియోలు ఎవరో తన తల్లికి పంపారని, ఆమెతో పాటు అప్పట్లో ఆ వీడియో అందరి మొబైల్స్ లో చక్కర్లు కొట్టింది అని, ఆఖరికి తన డ్రైవర్ కూడా ఆ వీడియో చూశాడని, తనకు ఆ సమయంలో ఏమి చేయాలో అర్ధం కాలేదని, చివరికు 4 రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక చెప్పింది. అయితే తరువాత ఆ సంఘటనే తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పింది రాధికా. అప్పటి తన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది ఈ అమ్మడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment