Radhika Apte : ఓ ప్ర‌ముఖ తెలుగు హీరో త‌న‌ను అస‌భ్యంగా తాకాడ‌న్న రాధికా ఆప్టే.. ఎవ‌ర‌త‌ను..?

August 4, 2022 12:34 PM

Radhika Apte : బాలీవుడ్ న‌టి రాధికా ఆప్టే ఎప్పటిక‌ప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఈమ‌ధ్యే త‌న భ‌ర్త గురించి ఈమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. త‌న భ‌ర్త చాలా పొడుగ్గా ఉంటాడ‌ని.. అది త‌న‌కు న‌చ్చ‌ద‌ని ఈమె కామెంట్స్ చేసింది. ఇక అంత‌కు ముందు కూడా సినీ ఇండ‌స్ట్రీపై కామెంట్స్ చేసింది. అప్ప‌ట్లో త‌న ఛాతి భాగం చిన్న‌గా ఉంద‌ని.. దాన్ని పెద్ద‌గా మార్చుకోవాల‌ని కొంద‌రు స‌ల‌హా ఇచ్చార‌ని.. అయితే అలా చేయ‌న‌ని చెప్ప‌డంతో సినిమాల నుంచి తీసేశార‌ని.. ఈమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఈమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ఓ టాలీవుడ్ టాప్ హీరో తనతో తప్పుగా ప్రవర్తించాడని రాధికా ఆప్టే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌ట్లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి ఆమె చెబుతూ.. ఆ తెలుగు సినిమాలో నాది మొదటి రోజు షూట్. నేను బెడ్ పై పడుకొని అనారోగ్యంగా ఉన్న సీన్ చిత్రీకరిస్తున్నారు. సెట్ లో చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఆ హీరో నా కాలు గిల్లాడు. ఆయన ఓ పెద్ద స్టార్. పరిశ్రమలో బాగా పలుకుబడి ఉన్న హీరో అని నాతో అంతకు ముందే చెప్పారు. అయినప్పటికీ నేను ఊరుకోలేదు. నాతో మరోసారి ఇలా ప్రవర్తిస్తే బాగోదని గట్టిగా చెప్పాను.. అంటూ రాధికా తెలియ‌జేసింది.

Radhika Apte said about old incident when filming a movie
Radhika Apte

అయితే వాస్త‌వానికి ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింది గ‌తంలోనే. కానీ ఇప్పుడు వాటిని వైర‌ల్ చేస్తున్నారు. ఇక తెలుగులో రాధికా ఆప్టే రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. ఈ నేపథ్యంలో రాధికాతో తప్పుగా ప్రవర్తించిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరా ? అని అందరూ సందేహాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆమె చేసిన ఆ కామెంట్స్ బాలకృష్ణ గురించేనని తెలుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ లో రాధికా యాక్ట్ చేసిన‌ టాప్ హీరో బాలయ్య మాత్రమే. ఆయనతో ఆమె లెజెండ్, లయన్ చిత్రాలలో నటించింది. టాప్ హీరో, పలుకుబడి కలిగిన హీరో అంటూ ఆమె ఇచ్చిన హింట్స్ నేరుగా బాలయ్యనే గుర్తు చేస్తున్నాయి. దీంతో పరోక్షంగా రాధికా ఆప్టే బాల‌కృష్ణ గురించే చెప్పింద‌ని తెలుస్తోంది. అయితే ఆమె 2018లో చేసిన ఈ కామెంట్స్‌ను ఇప్పుడు ఎందుకు వైర‌ల్ చేస్తున్నార‌నే విష‌యం అర్థం కావ‌డం లేదు. ఇక ఇందులో అస‌లు విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment