Radhe Shyam : ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అయితే ఓటీటీల్లోకి వచ్చేందుకు కాస్త ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా చాలా త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తోంది మరి. అవును.. ఈ మూవీ మార్చి 11వ తేదీన విడుదలైంది. అనుకున్న ప్రకారం అయితే ఏప్రిల్ 11వ తేదీ తరువాతే ఈ మూవీ ఓటీటీలోకి రావల్సి ఉంటుంది. కానీ 10 రోజుల ముందుగానే అంటే.. ఏప్రిల్ 1వ తేదీనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. కనుక ఈ మూవీ అందులోనే స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్‌ను తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఇక ఇంత త్వరగా ఓ అగ్రహీరో సినిమా ఓటీటీలోకి వస్తుందనే సరికి నిజంగానే నమ్మబుద్ది కావడం లేదు. చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ కాలేదు. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. అందుకనే మొదటి 3 రోజుల తరువాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇక రాధే శ్యామ్ సినిమా ఓటీటీలోకి వస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…