Radhe Shyam : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న రాధే శ్యామ్ మూవీ.. ఆ తేదీనే విడుద‌ల‌..!

March 28, 2022 5:57 PM

Radhe Shyam : ఈ మ‌ధ్య కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలు త్వ‌ర‌గానే ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు అయితే ఓటీటీల్లోకి వ‌చ్చేందుకు కాస్త ఆల‌స్యం అయ్యేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్ సినిమా చాలా త్వ‌ర‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది మ‌రి. అవును.. ఈ మూవీ మార్చి 11వ తేదీన విడుద‌లైంది. అనుకున్న ప్ర‌కారం అయితే ఏప్రిల్ 11వ తేదీ త‌రువాతే ఈ మూవీ ఓటీటీలోకి రావ‌ల్సి ఉంటుంది. కానీ 10 రోజుల ముందుగానే అంటే.. ఏప్రిల్ 1వ తేదీనే ఈ మూవీని ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.

Radhe Shyam movie to release on OTT
Radhe Shyam

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి డిజిట‌ల్ హ‌క్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. క‌నుక ఈ మూవీ అందులోనే స్ట్రీమ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్‌ను త‌మ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ చేస్తామ‌ని అమెజాన్ ప్రైమ్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఇక ఇంత త్వ‌ర‌గా ఓ అగ్ర‌హీరో సినిమా ఓటీటీలోకి వ‌స్తుంద‌నే స‌రికి నిజంగానే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదు. చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌వానికి రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ కాలేదు. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌చ్చింది. అందుక‌నే మొద‌టి 3 రోజుల త‌రువాత క‌లెక్ష‌న్లు భారీగా ప‌డిపోయాయి. ఇక రాధే శ్యామ్ సినిమా ఓటీటీలోకి వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment