Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాహో తర్వాత ఆయన సినిమా విడుదల కాక చాలా రోజులైంది. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ పూర్తైన రాధే శ్యామ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపు మూడేళ్లు అవుతోంది. అనేక కారణాలతో ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
ఈ మూవీకి అనుకున్న స్థాయిలో అప్‌డేట్స్ రావడం లేదు. చాలా కాలంగా ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. రాధే శ్యామ్ నిర్మాతలుగా ఉన్న యూవీ క్రియేషన్స్ పై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ పై పలుమార్లు ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ఓ అభిమాని యూవీ క్రియేషన్స్ తీరుతో విసిగిపోయి.. ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాశాడు. తన చావుకు యూవీ క్రియేషన్స్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కారణం అని లేఖలో పేర్కొన్నాడు.
నా చావుతో అయినా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ సూసైడ్ నోట్ లో తన మనోభావాలు వెల్లడించాడు. ఈ లెటర్ తర్వాత మేకర్స్ వెంటనే అప్‌డేట్ ఇచ్చారు.
నవంబర్ 15న ఈ రాతలే అనే సాంగ్‌ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ పాటలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించనుందట. ‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీ వర్షన్ లో మిథున్, మనన్ భరద్వాజ్ లు కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సౌత్ లాంగ్వేజెస్ లో జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…