Pushpaka Vimanam : పుష్ప‌క విమానం ట్రైల‌ర్.. అద‌ర‌గొట్టే కాన్సెప్ట్‌తో ఆస‌క్తిరేపుతున్న చిత్రం..

October 31, 2021 8:52 AM

Pushpaka Vimanam : విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌లు ఎంచుకుంటూ ఇండ‌స్ట్రీలో పాతుకుపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దొర‌సాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల‌తో న‌టుడిగా నిరూపించుకున్నాడు. తాజాగా పుష్ప‌క విమానం సినిమాతో ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు ఆనంద్. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. ఇందులో శాన్వి మేఘన కథానాయికగా న‌టించింది.

Pushpaka Vimanam trailer different concept attracting audience

పుష్ప‌క విమానం చిత్రాన్ని నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్ర‌మంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్ విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్‌ (ఆనంద్‌ దేవరకొండ) అనే స్కూల్‌ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు ? అనేది ఆస‌క్తికరంగా సినిమాలో చూపించ‌నున్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మైంది.

ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. పెళ్లైన పది రోజులకే త‌న భార్య‌ లేచిపోతుంది. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగానే అందరినీ నమ్మిస్తాడు. హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తన భార్య చేసిందని స్కూల్‌లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా ? అని పోలీస్ క్యారెక్టర్‌లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది.

చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. రామ్‌ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్‌, నరేశ్‌, హర్షవర్థన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now